చంద్రబాబు వాంగ్మూలంలో సంచలన నిజాలు..
ABN, First Publish Date - 2023-09-12T10:28:58+05:30
అమరావతి: చంద్రబాబు న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు తనను మానసికంగా వేధించారని, తనను కావాలనే రోడ్లపై వాహనంలో తిప్పారని చంద్రబాబు ఆరోపించారు.
అమరావతి: చంద్రబాబు న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు తనను మానసికంగా వేధించారని, తనను కావాలనే రోడ్లపై వాహనంలో తిప్పారని చంద్రబాబు ఆరోపించారు. విచారణ దృశ్యాలను ఉద్దేశం పూర్వకంగానే ప్రసారం చేయించారని, పోలీసులకు అలాంటి అధికారం లేదన్నారు. తనకు బీపీ, షుగర్ స్థాయి పెరిగినట్లు పరీక్షల్లో తేలిందన్నారు. సీఐడీ, డీఐజీ తనను ప్రశ్నించారని, విచారణ అధికారి ధనుంజయ్ అయితే వేరేవాళ్లను ఎలా విచారిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-12T10:28:58+05:30 IST