చంద్రబాబు పిటిషన్లపై నేడు విచారణ..
ABN, First Publish Date - 2023-09-27T10:46:53+05:30
అమరావతి: తనకు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ బుధవారం జరగనుంది.
అమరావతి: తనకు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ బుధవారం జరగనుంది. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు మంగళవారం సెలవు పెట్టడంతో రెండో అదనపు జిల్లా జడ్జి సత్యానంద్ ఇన్చార్జ్‌గా వ్యవహరించారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు ప్రమోద్ దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అవి రెగ్యులర్ కోర్టులో విచారిస్తారని చెప్పిన న్యాయమూర్తి తదుపరి విచారణ బుధవారం నాటికి వాయిదా వేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-27T10:46:53+05:30 IST