పెద్దపల్లి బీజేపీలో మూడు ముక్కలాట
ABN, First Publish Date - 2023-06-16T13:07:16+05:30
కరీంనగర్ జిల్లా: పెద్దపల్లి నియోజకవర్గం బీజేపీలో మూడు ముక్కలాట జరుగుతోంది. ఆ నియోజకవర్గంలో బీజేపీ నేతలు మూడు వర్గాలుగా విడిపోయారు. ఎవరి వైపు ఉండాలో తెలియక క్యాడర్ నలిగిపోతోంది.
కరీంనగర్ జిల్లా: పెద్దపల్లి నియోజకవర్గం బీజేపీలో మూడు ముక్కలాట జరుగుతోంది. ఆ నియోజకవర్గంలో బీజేపీ నేతలు మూడు వర్గాలుగా విడిపోయారు. ఎవరి వైపు ఉండాలో తెలియక క్యాడర్ నలిగిపోతోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం రహస్య సమావేశాలు నిర్వహిస్తూ.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. మరో గ్రూపుకు నాయకత్వం వహిస్తున్న గొట్టెముక్కల సురేష్ రెడ్డి తన కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దుగ్యాల ప్రదీప్ కుమార్ మరో వర్గాన్ని నడుపుతున్నారు. పెద్దపల్లి గ్రూపులను అధిష్టానం నియంత్రించలేకపోతోంది. ఎన్నికల సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనని క్యాడర్ ఆందోళనలో ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-06-16T13:07:16+05:30 IST