ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎంపీ అవినాష్ అనుచరుల బెదిరింపులు
ABN, First Publish Date - 2023-05-19T10:53:12+05:30
హైదరాబాద్: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ఇంటి దగ్గర ఆయన అనుచరులు ఓవరాక్షన్ (Overaction) చేస్తున్నారు. మీడియా (Media)పై బెదిరింపులకు దిగారు.
హైదరాబాద్: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ఇంటి దగ్గర ఆయన అనుచరులు ఓవరాక్షన్ (Overaction) చేస్తున్నారు. మీడియా (Media)పై బెదిరింపులకు దిగారు. వీడియోలు తీస్తే కెమెరాలు పగలగొడతామన్నారు. ఆంధ్రజ్యోతి (Andhrajyothy) ప్రతినిధితోపాటు కెమెరామెన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఒక చానల్‌కు మాత్రమే వీడియోలు తీయడానికి అనుమతించారు. కాగా అవినాష్ రెడ్డి మరికాసేపట్లో సీబీఐ (CBI) ఎదుట హాజరుకానున్నారు. ఆయన అరెస్టు తప్పదని ఇప్పటికే సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపిన దృష్ట్యా అవినాష్ విచారణ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-05-19T10:53:12+05:30 IST