గణేష్ నిమజ్జనంలో యువకుడికి గుండెపోటు
ABN, First Publish Date - 2023-09-28T11:14:03+05:30
రాజస్థాన్: గణేష్ నిమజ్జనంలో ఓ యువకుడికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి రాజేంద్ర కుమార్ అప్రమత్తమయ్యారు. వెంటనే యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
రాజస్థాన్: గణేష్ నిమజ్జనంలో ఓ యువకుడికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి రాజేంద్ర కుమార్ అప్రమత్తమయ్యారు. వెంటనే యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు పోలీస్ అధికారిపై ప్రశంసలు కురిపించారు. యువకుడు కోలుకున్న తర్వాత అతని వివరాలు అడిగి తెలుసుకుని.. కొంతమంది యువకులను తోడుగా అతనిని నివాసానికి పంపించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-28T11:14:03+05:30 IST