నడిరోడ్డుపై ఓ మోడల్ యోగా..
ABN, First Publish Date - 2023-10-10T11:52:01+05:30
గుజరాత్: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు, యూట్యూబ్ షాట్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో అలాంటి వీడియోలు రూపొందించి ఎలాగైనా పాపులారిటీ సంపాదించాలని చాలా మంది ఊవిళ్లూరుతున్నారు.
గుజరాత్: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు, యూట్యూబ్ షాట్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో అలాంటి వీడియోలు రూపొందించి ఎలాగైనా పాపులారిటీ సంపాదించాలని చాలా మంది ఊవిళ్లూరుతున్నారు. అందుకోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. నడిరోడ్డు మీద రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ మోడల్ రోడ్డుపై యోగా చేసి వీడియో రూపొందించింది. చినుకులు పడుతుంటే నడిరోడ్డుపై వాహనాలను ఆపి మరీ వీడియోను రికార్డు చేసింది. అయితే ఆ వీడియో చిత్రీకరించే సమయంలో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-10T11:52:01+05:30 IST