ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో యువత పోరాడాలి

ABN, First Publish Date - 2023-03-20T00:40:34+05:30

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి సీపీఎం, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం జిల్లా ప్ర ధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మల్లు స్వరా జ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమురయ్య భవనంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

నల్లగొండలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో యువత పోరాడాలి

నల్లగొండటౌన, మార్చి 19: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి సీపీఎం, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం జిల్లా ప్ర ధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మల్లు స్వరా జ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమురయ్య భవనంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం కమ్యూనిస్టు సిద్ధాంతాలను దృఢంగా నమ్మి 16 ఏళ్ల వయస్సులో ఉద్యమంలోకి వచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి, బానిసత్వానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఆమె పాల్గొన్నారని పేర్కొన్నారు. తర్వాత గెరిలాల పోరాటంలో మహిళలను చేర్చుకోవడం, వారికి శిక్షణ ఇవ్వడంలో ఆమె కీలకపాత్ర పోషించారని కొనియాడారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యలపై తనదైన శైలిలో వాదన వినిపించినట్లు పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మల్లు స్వరాజ్యం పెద్ద కుమారుడు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లు గౌతమ్‌రెడ్డి మాట్లాడు తూ ఆమె జీవితం నేటికి మా కుటుంబంతో పాటు సమాజానికి ఆ దర్శనీయమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్‌ హషం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, చిన్నపాక లక్ష్మీనారాయణ, పా లడుగు ప్రభావతి, మహమ్మద్‌ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, దం డంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పొట్టబత్తిని యాదగిరి, నగేష్‌, అ రుణకుమారి, అశోక్‌రెడ్డి, పరిపూర్ణచారి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-20T00:40:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising