ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువగళంలో వైసీపీ కవ్వింపు చర్యలు

ABN, First Publish Date - 2023-09-04T04:02:59+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేశాయి.

మందలపర్రులో పాదయాత్రపై రాళ్లదాడి

టీడీపీ నాయకులకు గాయాలు, కార్ల అద్దాలు ధ్వంసం

నిడమర్రు, సెప్టెంబరు 3: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేశాయి. పాదయాత్రను ఆటంకపరచాలనే దురుద్దేశంతో వైసీపీకి చెందిన అల్లరి మూకలు దాడి చేశాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆదివారం యువగళం పాదయాత్ర ఏపీలోని ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రుకు రాగానే కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్రలో ఉన్న వారిమీదకు వచ్చారు. రెండు పార్టీల నాయకుల మధ్య తోపులాటలు జరిగాయి. కొందరు వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులు చేయడంతో కొంత మంది టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల రాకతో ఘర్షణ సద్దుమణిగింది. అనంతరం టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం ఫిర్యాదులు చేశాయి. లోకేశ్‌ పాదయాత్రకు వస్తున్న విశేష ఆదరణను ఓర్వలేకనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు.

Updated Date - 2023-09-04T04:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising