ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుబంధు రాదేమీ?

ABN, First Publish Date - 2023-01-10T00:45:47+05:30

యాసంగి సీజన్‌కు రైతు బంధు(పదో విడత) డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నగదు బదిలీ చేయడం ప్రారంభించి 13 రోజులు గడిచినా అందరికీ అందలేదు. ప్రభుత్వానికి నిధుల కొరతే కారణంగా తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి జిల్లాలో రూ.555 కోట్లు బకాయి

సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న అందని సాయం

పెట్టుబడికి అప్పులు తెచ్చుకుంటున్న రైతులు

నాలుగు ఎకరాల వరకే అందిన రైతుబంధు

మోత్కూరు: యాసంగి సీజన్‌కు రైతు బంధు(పదో విడత) డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నగదు బదిలీ చేయడం ప్రారంభించి 13 రోజులు గడిచినా అందరికీ అందలేదు. ప్రభుత్వానికి నిధుల కొరతే కారణంగా తెలుస్తోంది. దీంతో రైతుబంధు సాయం మందకొడిగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రానికి సుమారు రూ.555 కోట్లు బకాయిగా ఉంది.

గతేడాది డిసెంబరు 28 నుంచి రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో రైతుబంధు నిధు లు జమచేయడం ప్రారంభించా రు. విడతల వారీలో భాగంగా నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే నిధులు జమ చేశారు. మొదటగా అరెకరం నుంచి మూడు ఎకరాల లోపు భూమి ఉన్న వారికి, ఆ తర్వాత నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు రైతులకు నిధులు వేస్తామని ప్రకటించినా నేటికీ అమల్లోకి రాలేదు. నాలుగు ఎకరాలపైన ఒక్క గుంట ఉన్నా నిధులు జమ కాలేదంటున్నారు. కొందరు రైతులు నాట్లు వేయడానికి పెట్టుబడి కోసం రైతుబంధు నిధుల కోసం ఎదురుచూస్తుండగా, మరి కొందరు రైతులు అప్పులు తెచ్చి నాట్లు వేశారు. ఇప్పటికీ రైతుబంధు అందకపోవడంతో తెచ్చిన అప్పులపై వడ్డీలు పెరుగుతున్నాయని మదనపడుతున్నా రు. యాసంగి సీజన్‌కు సాధారణంగా నవంబరు చివరి వారంలో నార్లుపోసి డిసెంబరు చివరి వారంలో నాట్లు వేస్తారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతుబంధు డబ్బులు డిసెంబర్‌ మొదటి వారంలోనో, రెండో వారంలోనో ఇచ్చినా నాట్లు, దున్నకాలు, దుక్కి మం దు బస్తాలు, కలుపు కూళ్లు తదతర పెట్టుబడికి ఉపయోగపడతాయి. జనవరి నెల వచ్చినా ఇవ్వకపోవడంతో నాట్లు వేయడానికి రైతులు వడ్డీ వ్యాపారల వద్ద అప్పు చేయాల్సి వచ్చింది. కొందరు పత్తి రైతులకు పంట వచ్చినా కూడా గతేడాదితో పోలిస్తే తక్కువ ధర ఉండటం తో పెట్టుబడులకు డబ్బు అవసరమున్నా విక్రయించలేదు. దీంతో రైతుల వద్ద డబ్బులకు ఇబ్బంది ఏర్పడింది. రైతుబంధు సాయం ఎప్పుడు వస్తుందో వ్యవసాయాధికారులు సహితం రైతులకు స్పష్టత ఇవ్వకలేకపోతున్నారు.

సూర్యాపేట జిల్లాలో రూ.130 కోట్లు పెండింగ్‌

జిల్లా వ్యాప్తంగా రైతుబంధు పథకానికి 2,67,191 మంది అర్హులుగా గుర్తించారు. వారిలో డిసెంబరు 28 నుంచి జనవరి 2వరకు 2,20,000మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.170 కోట్లు జమ చేసింది. ఇంకా 47,191వేల మంది రైతులకు రూ. 130 కోట్లకు పైగా అందాల్సి ఉంది.

యాదాద్రి జిల్లాలో రూ.156 కోట్లు బకాయి

జిల్లాలో 2.63లక్షల మంది రైతులకు రూ.303.84 కోట్లు పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. 2 లక్షల 28 వేల 486 మంది రైతులకు రూ.269 కోట్ల 33 లక్షల 46వేలు కోశాగారానికి పంపారు. ఇప్పటివరకు లక్ష 86 వేల 900 మంది రైతులకు రూ.147 కోట్ల లక్షా 89 వేలు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి.

నల్లగొండ జిల్లాలో రూ.296 కోట్లు బకాయి

రైతుబంధు పథకానికి మొత్తం 4,78,036 మంది రైతులను అర్హులుగా నిర్ధారించారు. వీరికి మొత్తం రూ.595.35 కోట్లు అందజేయాల్సి ఉంది. సోమవారం సాయంత్రం వరకు రూ.326.15 కోట్లు నగదు జమ చేశారు.

వారంలో 10 వేల మందికే

రైతుబంధు పథకం ఎంత నెమ్మదిగా నడుస్తుందో ప్రభుత్వం రైతులకు అందజేసిన సాయాన్ని చూస్తే ఇట్టే తెలిసిపోతోంది. ఈ నెల 2వ తేదీన 3,82,589 మంది రైతుల ఖాతా ల్లో రూ.308.60 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత వారం రోజులకు 9వ తేదీ వరకు 3,92,413 మంది రైతుల ఖాతాల్లో రూ.326.15 కోట్లు జమ చేసిన ట్లు చూపించారు అంటే వారంలో రూ.18కోట్ల పైచిలుకు మాత్రమే నగదు జమచేశారు. దీనిని బట్టి చూస్తే ఈ పథకం ఎంత నెమ్మదిగా నడుస్తుందో స్పష్టం అవుతోంది. ఇక రైతుల సంఖ్య కూడా వారంలో 10వేల మందికి మాత్రమే నగదును జమ చేశారు.

రైతు బంధు అందలేదు : పన్నాల శ్రీనివాసరెడ్డి, రైతు, మోత్కూరు

నాకు 4 ఎకరాల 35 గుంటల భూమి ఉంది. యాసంగిలో వరి నాట్ల కోసం పెట్టుబడి లేక అప్పు తెచ్చా. ప్రభుత్వం గతేడాది డిసెంబరు 28 నుంచే రైతు బంధు సాయం ఖాతాల్లో వేస్తున్నామని చెబుతోంది. నాకు ఇప్పటి వరకు అందలేదు. రోజూ బ్యాంకుకు వెళ్లి చూసుకుంటున్నా. తెచ్చిన అప్పుకు వడ్డీ పెరుగుతోంది. యాసంగి సీజన్‌కు డిసెంబర్‌ మొదటి వారంలోనే రైతుబంధు ఇస్తే రైతులు అప్పులకు వెళ్లకుండా పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం వెంటనే రైతుబంధు డబ్బు ఇవ్వాలి.

ఆలస్యమైనా రైతుబంధు వస్తుంది : డి.రామారావునాయక్‌, జేడీఏ, సూర్యాపేట

రైతుబంధు సాయం జమ చేయ డం కొంత ఆలస్యమైంది.ప్రభుత్వం అన్నివిధాలుగా సర్దుబాటు చేసుకుని నగదు విడుదల చేస్తోంది. ఆలస్యమైనా అర్హులైన రైతులందరికీ రైతుబంధు నగదు అందజేస్తుంది.

Updated Date - 2023-01-10T00:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising