విద్యుత్ షాక్‌తో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మహిళ మృతి
ABN, First Publish Date - 2023-06-26T02:32:44+05:30
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. వర్షపు నీటిని దాటేందుకు ఒక విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్న ఓ మహిళ, విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం సాయంత్రం
న్యూఢిల్లీ, జూన్ 25: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. వర్షపు నీటిని దాటేందుకు ఒక విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్న ఓ మహిళ, విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. మృతురాలిని తూర్పు ఢిల్లీకి చెందిన సాక్షి అహుజాగా గుర్తించామని వెల్లడించారు. విద్యుత్ షాక్ తగిలిన వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని వివరించారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగర పోలీసులు తెలిపారు. కాగా.. ఢిల్లీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇలాంటి ప్రమాదాలు సంభవించవచ్చని, పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Updated Date - 2023-06-26T02:32:44+05:30 IST