ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోహిత్‌ దారి ఎటువైపు?

ABN, First Publish Date - 2023-08-22T03:59:51+05:30

మెదక్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించి విఫలమైన మైనంపల్లి కుమారుడు డాక్టర్‌ రోహిత్‌ పయనం ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది.

కొడుకుతోపాటు, మైనంపల్లీ కాంగ్రెస్‌ వైపు?

మెదక్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించి విఫలమైన మైనంపల్లి కుమారుడు డాక్టర్‌ రోహిత్‌ పయనం ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్‌ బీఆర్‌ఎ్‌సలోనే ఉంటారా లేక పార్టీ మారుతారో తెలియక ఆయన వర్గీయులు అయోమయంలో పడ్డారు. ఎన్నో ఆశలతో మెదక్‌లో రోహిత్‌ తన మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో విభేదించిన వారందరినీ హన్మంతరావు చేరదీశారు. గతంలో మెదక్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు.. నియోజకవర్గంలో కొంత పట్టుంది. అందుకే రోహిత్‌ను అక్కణ్నుంచీ నిలబెట్టాలని భావించారు. మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉంటున్న హన్మంతరావు.. ఆయన చెప్పడం వల్లనే మెదక్‌లో పనిచేసుకుంటున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇంతకాలం టికెట్‌ తనకే వస్తుందని గట్టిగా నమ్మిన రోహిత్‌కు టికెట్‌ రాకపోవడంతో మైనంపల్లి వర్గంలో నైరాశ్యం నెలకొన్నది. తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్‌ గులాబీపార్టీలో ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. రోహిత్‌తోపాటు మైనంపల్లి కూడా కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తారని..లేదా ఇద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తారని కూడా విశ్వసనీయ వర్గాలు కొన్ని చెబుతున్నాయి.

Updated Date - 2023-08-22T03:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising