ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

60 ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేళ్లలో చేశాం

ABN, First Publish Date - 2023-06-07T01:03:45+05:30

తెలంగాణలో 60ఏళ్లలో జరగని అభివృద్ధిని తొమ్మిదేళ్లలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామంలోని గ్రీన్‌ ఇండస్ర్టీయల్‌ పార్కులో మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి

ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌

చౌటుప్పల్‌ /చౌటుప్పల్‌ రూరల్‌, జూన్‌ 6: తెలంగాణలో 60ఏళ్లలో జరగని అభివృద్ధిని తొమ్మిదేళ్లలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామంలోని గ్రీన్‌ ఇండస్ర్టీయల్‌ పార్కులో మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహించారు. ఇండస్ర్టియల్‌ పార్కులో 51 కంపెనీలను, రూ.41కోట్లతో నిర్మించిన కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ భవనాన్ని మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. 106 ఎకరాల్లో రూ.158కోట్లతో ఏర్పాటు చేయనున్న టాయ్స్‌ పార్కుకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందన్నారు. పర్యావరణం పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి జరుగుతోందన్నారు. తెలంగాణ వస్తే ఏంజరుగుతుందని అన్న వాళ్లకు తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమతుల్యత, సమ్మిళిత అభివృద్ధి జరుగుతుందన్నది సమాధానమన్నారు. పరిశ్రమల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. టీఎస్‌ పాస్‌ విధానంలో పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదని, అక్కడి పారిశ్రామికవేత్తలే ఇదే విషయాన్ని తనతో చెప్పినట్లు తెలిపారు. చౌ టుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో రూ. 95లక్షలతో ఏర్పాటు చేయతలపెట్టిన మోడ్రన్‌ సేల్స్‌ షోరూం భవనానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

జాతీయ స్థాయిలో 30 అవార్డులు మనకే..

చరిత్రలో మూడో అతి పెద్ద కార్యక్రమం హరితహారం అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్‌ తరాలకు పచ్చటి వాతావరణం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’కి జాతీయ స్థాయిలో 30అవార్డులు వచ్చాయని, ‘పట్టణ ప్రగతి’కి కూడా జాతీయస్థాయి అవార్డులు లభించాయని వివరించారు. తెలంగాణలో మారుమూల గ్రామాల్లో ఉన్న రూ.2వేల పింఛన్‌ తీసుకుంటున్న ప్రజల నుంచి పరిశ్రమల కోసం రాయితీ పొందుతున్న పారిశ్రామికవేత్తల వరకు నేడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణను అవహేళన చేసిన వారు నేడు కనుమరుగవుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా నేడు విద్యుత్‌ కోతలతో ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నో దేశాలు తిరిగిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హైదరాబాద్‌ అద్భుతంగా అభివృద్ధి చెందిందని పొగిడి కితాబునిచ్చారని గుర్తు చేశారు. టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు మాట్లాడుతూ తెలంగాణలో పరిశ్రమ లను ఏర్పాటు చేసేందుకు పెద్దసంఖ్యలో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. దండుమల్కాపురంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని పేర్కొన్నారు. గ్రీన్‌ ఇండ స్ర్టియల్‌ పార్క్‌ తరహలో మరో ఇండ్రస్టియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. పారిశ్రామికవేత్తలు సదాశివారెడ్డి, స్వామిగౌడ్‌, దేవేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు పరిశ్రమల పరిస్థితి దయనీయంగా ఉండేదని, విద్యుత్‌ సరఫరా లేక పరిశ్రమలను వారంలో మూడు రోజులే నిర్వహించామన్నారు. తెలంగాణ వచ్చాక పరిశ్రమలకు ఎలాంటి విద్యుత్‌ సమస్యలు లేవని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిషోర్‌, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, కల్లుగీత సహకార చైర్మన్‌ పల్లె రవికుమార్‌, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖా ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయే్‌షరంజన్‌, రాష్ట్ర చేనేత జౌళిక శాఖ కమిషనర్‌ బుద్ద ప్రకా్‌షజ్యోతి, కలెక్టర్‌ పమేలా సత్పథి, తెలంగాణ ఇండ్రస్టియల్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కొండవీటి సుధీర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి గోపాల్‌రెడ్డి, సర్పంచ్‌ ఎలువర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టంపల్లి శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, సింగిల్‌విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రీన్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో స్థానిక నిరుద్యోగ యువత, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు.

Updated Date - 2023-06-07T01:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising