ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైసలు పడతాయట!

ABN, First Publish Date - 2023-04-03T23:33:54+05:30

ఇటీవల అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎకరాకు రూ. 10వేల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించింది. పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించింది.

మొగుళ్లపల్లి మండలంలో నష్టపోయిన మిర్చి పంటను పరిశీలిస్తున్న ఉద్యాన శాఖ అధికారులు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పంట పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

నష్టపోయిన రైతులకు అందించేందుకు సన్నద్ధం

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల వివరాలు సేకరణ

ఎకరాకు రూ. 10 వేలు చెల్లించేందుకు కార్యాచరణ

పది రోజుల్లో ఖాతాల్లో జమ చేసే అవకాశం!

కృష్ణకాలనీ (భూపాలపల్లి), ఏప్రిల్‌ 3: ఇటీవల అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎకరాకు రూ. 10వేల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించింది. పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించింది. భూపాలపల్లి జిల్లాలోని ఐదు మండలాల్లోనే అధికంగా ప్రభావం ఉండటంతో ఆ ప్రాంతా ల్లోనే అధికారులు సర్వే చేపట్టి నివేదికను రూపొందించారు. త్వరలోనే రైతుల ఖాతాలో పరిహారం డబ్బులు పడతాయని అంటున్నారు. అయితే.. ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిహారాన్ని సకాలంలో పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. లేదంటే ఇప్పటికే ఆర్థికంగా చితికి పోయిన తాము కోలుకోలేని పరిస్థితి ఉంటుందని అంటు న్నారు. ఇదిలా ఉండగా పంట నష్టంపైౖ ఎకరాకు రూ. 10 వే లు మాత్రమే ప్రభుత్వం ప్రకటించడంపై పలువురు రైతులు పెదవి విరుస్తున్నారు. ఇది కంటితుడుపు చర్య మాత్ర మేనని, రైతులకు పరిహారం మరింత పెంచాలని పలువురు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నాయి.

గత నెల 17,18,19 తేదీల్లో కురిసిన అకాల వర్షంతో భూ పాలపల్లి జిల్లా రైతులు నష్టపోయారు. వడగండ్ల వానతో ముఖ్యంగా గణపురం, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ల పల్లి మండలాల్లో అధికంగా నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తం గా 11 మండలాల్లో వీటిలోనే 3,999 ఎకరాల్లో వివిఽధ పంట లు దెబ్బతిన్నట్టు అధికారులు నివేదికను తయారు చేశారు. గణపురం మండలంలో మొక్కజొన్న 446 ఎకరాలు, రేగొండ మండలంలో మొక్కజొన్న 250, చిట్యాల మండలంలో మొక్క జొన్న 497, టేకుమట్ల మండలంలో మొక్కజొన్న 40, మొగు ళ్లపల్లి మండలంలో మొక్కజొన్న 634 ఎకరాల్లో నష్టం వాటిల్లి నట్టు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. వీటితో పాటు 2,500 ఎకరాల్లో మిర్చి, ఎనిమిది ఎకరాల్లో బొప్పాయి, 70 ఎకరాల్లో పుచ్చకాయ తోటలకు నష్టం వాటిల్లినట్టు ఉద్యా న శాఖ అధికారులు నివేదికను రూపొందించారు.

పది రోజుల్లో పరిహారం?

అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభు త్వం పరిహారం అందించేందుకు సిద్ధమైంది. ఎకరాకు రూ. 10 వేల చొప్పున అందించే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ క్రమంలో మరో పది రోజుల్లో రైతులకు పరిహారం అందనున్నట్టు తెలుస్తోం ది. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నష్టం వాటిల్లినా ఐదు మండలాల్లోనే సర్వే చేయడంపై పలువురు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. మరోవైపు జిల్లా అంతటా పంట నష్టం లేదని అధికారు లు అంటున్నారు. ఐదు మండలాల్లోనే అత్యధికంగా నష్టం వాటిల్లిడం వల్లే ప్రభుత్వ ఆదేశాలనుసారం వాటిలోనే సర్వే చేపట్టినట్టు తెలిపారు. అయితే.. ప్రభుత్వం తెప్పించుకున్న నివేదికలనుసారం పరిహారం సకాలంలో తమ ఖాతాల్లోకి జమ చేయాలని బాధిత రైతులు అంటున్నారు. ఈ విషయంలో తాత్సారం చేస్తే తాము మరింత చితికిపోతామని అంటున్నారు.

జిల్లా అంతటా నష్టం వాటిల్ల లేదు..

- విజయభాస్కర్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికలు అందించాం. నష్టపరిహారం ప్రభుత్వం అందించగానే బాధిత రైతులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అందజేస్తాం. జిల్లా అంతటా పంటలకు నష్టం కలగలేదు. అధిక వర్షాలు కేవలం ఐదు మండలాల్లోనే పడటం వల్ల ఆ ప్రాంతాల్లోనే క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాం.

Updated Date - 2023-04-03T23:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising