ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ని సస్పెండ్‌ చేయాలి

ABN, First Publish Date - 2023-04-03T23:55:11+05:30

టీఎ్‌సపీఎ్‌ససీ ప్రశ్నా పత్రాల లీకేజీ ఘటనలో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డిని విధుల నుంచి వెంటనే సస్పెండ్‌ చేయాలని బీఎ్‌సపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

కేయూలో నిరుద్యోగ సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బీఎ్‌సపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌

హనుమకొండ, ఏప్రిల్‌ 3 : టీఎ్‌సపీఎ్‌ససీ ప్రశ్నా పత్రాల లీకేజీ ఘటనలో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డిని విధుల నుంచి వెంటనే సస్పెండ్‌ చేయాలని బీఎ్‌సపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం వరంగల్‌ పర్యటనలో భాగంగా కేయూను సందర్శించారు. ఇటీవల కేయూ పరిపాలన భవనం వద్ద ధర్నా ఘటనలో కేసుల పాలైన కేయూ విద్యార్థి జేఏసీ నాయకులను పరామర్శించారు. ఈ సందర్భంగా బహుజన స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (బీఎ్‌సపీ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బొట్ల మనోహర్‌ అధ్యక్షతన కేయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. టీఎ్‌సపీఎ్‌సపీ బోర్డును ప్రక్షాళన చేయాలని అన్నారు. ప్రశ్నా పత్రాల లీకేజీపై ఈడీ, సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలని అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధం అవుతుంటే టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశ్నా పత్రాలు అమ్ముకోవడంలో బీజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్‌ ఘటనలో స్పందించి మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ ప్రశ్నా పత్రాల లీకేజీపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేయాలని, నిధులను విడుదల చేయాలని డిమండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ తన మిత్రులకు ప్రైవేట్‌ వర్సిటీలను కట్టబెట్టి రాష్ట్రంలో విద్యను వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. పేద, దళిత వర్గాలకు విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బహుజనులు ఐక్యంగా రాజ్యాధికారాన్ని సాధించాలని ఉద్బోధించారు. సమస్యలపై పోరాడితే కేసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో కేయూ జాక్‌ చైర్మన్‌ ఇట్టబోయిన తిరుపతియాదవ్‌, గుగులోత్‌ రాజునాయక్‌, ఇ.విజయ్‌కన్నా, బి.నరసింహారావు, కాడపాక రాజేందర్‌, ఓంటేరు చక్రి, బొల్లె మధుకర్‌, కల్లెపల్లి ప్రశాంత్‌, బొట్ల తేజ, అరెగంటి నాగరాజు, రమేశ్‌, కాశినాథ్‌, బీఎస్సీ జిల్లా నాయకులు వెంకటేశ్‌ చౌహన్‌, మఽధారపు రవికుమార్‌, మంద శ్యామ్‌, శనిగరపు రాజు, బి.సారయ్య, పొన్న భిక్షపతి, వేణుగోపాల్‌, సాజన్‌, గడ్డం రాజేశ్‌, మహిళ నాయకులుఅడ్లూరి పద్మ, జన్ను నిలీమ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:55:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising