కాపీ కొట్టే కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి
ABN, First Publish Date - 2023-09-22T00:10:19+05:30
బీఆర్‌ఎస్ సర్కారు పథకాలను కాపీకొట్టే కాంగ్రెస్‌ను గ్రామాల పొలిమేరల నుంచి తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని చిన్నవంగర గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ పాకనాటి సునిల్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఆ పార్టీకి అధికారమిస్తే అంధకారమే..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పెద్దవంగర, సెప్టెంబరు 21: బీఆర్‌ఎస్ సర్కారు పథకాలను కాపీకొట్టే కాంగ్రెస్‌ను గ్రామాల పొలిమేరల నుంచి తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని చిన్నవంగర గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ పాకనాటి సునిల్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు.. వచ్చాక మన బతుకులు ఎలా ఉన్నాయి.. జరిగిన మార్పు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు నెమరు వేసుకోవాలన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. పేదల హృదయాల్లో సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. 24 గంటల ఉచిత కరెంట్ అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్, బీజేపీ నాయకులు బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని, అలాంటి అబద్దాలకోరులను ప్రజలే శిక్షించాలని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అంధకారమవుతుందని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని, రేపు మనలను కూడా మోసం చేయడానికి వస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దయాకర్‌రావు అన్నారు. అద్భుత ప్రగతిని సాధిస్తున్న తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. పొలిటికల్ టూరిస్టులు రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ అసంబద్ధ ప్రకటనలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామానికి చెందిన గూడెల్లి మల్లయ్య మంత్రి ఎర్రబెల్లిపై ఉన్న అభిమానంతో పాడిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం మండల కేంద్రంలో ఇటీవల ధర్మరపు వీరన్న, రాపోలు యాకయ్య, మద్దరబోయిన రాములు మరణించడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్‌రెడ్డి, తొర్రూరు మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ సోమేశ్వర్‌రావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వి.రామచంద్రయ్యశర్మ, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, శ్రీరాం సుధీర్, శ్రీరాం సంజయ్, సోమేశ్వర్‌రావు, సోమ నర్సింహారెడ్డి, శ్రీనివాస్, సోమారెడ్డి, విజయ్‌పాల్‌రెడ్డి, శేఖర్, రాము, లింగమూర్తి, హరీష్, కుమార్, సతీష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:10:19+05:30 IST