మింగేశారు.. ముంచేశారు
ABN, First Publish Date - 2023-06-26T23:37:29+05:30
అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అన్యక్రాంత పర్వంతో భూముల స్వాభావం మారిపోతోంది. పంట పొలాలు వెంచర్లుగా వెలుస్తున్నాయి. కాల్వలు సైతం మాయమవుతు న్నాయి.
ములుగు జిల్లా కేంద్రంలో అన్యాక్రాంత పర్వం
కబ్జాకు గురవుతున్న పంట కాల్వలు
వెంచర్లుగా వ్యవసాయ భూములు
ఆక్రమించి ప్లాట్లు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
ఇప్పటికే వెలిసిన శాశ్వత నిర్మాణాలు
వానాకాలంలో ముంపునకు గురవుతున్న కాలనీలు
ములుగు, జూన్ 26: అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అన్యక్రాంత పర్వంతో భూముల స్వాభావం మారిపోతోంది. పంట పొలాలు వెంచర్లుగా వెలుస్తున్నాయి. కాల్వలు సైతం మాయమవుతు న్నాయి. జిల్లా కేంద్రం లో ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణా లు కొనసాగుతున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ మెరుగు పడటం దేవుడెరుగు.. ఉన్నది కూడా ఉనికిని కోల్పో తోంది. దీంతో వర్షాకాలం లో ములుగు ముంపునకు గురవుతోంది. వర్షం, వరదనీటి ప్రవాహానికి సరైన మార్గం లేకపోవడంతో పలు కాలనీలు ప్రతి ఏటా ముంపునకు గురవుతున్నాయి. ఈ ఆక్రమణలకు అడ్డులేకపోవడంతో భవిష్యత్తుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ములుగు జిల్లా కేంద్రంగా గుర్తింపు పొందడంతో స్థానికంగా భూములకు డిమాండ్ పెరిగింది. పంట పొలాలన్నీ నాన్ అగ్రికల్చర్ భూములుగా రికార్డుల్లో మారిపోతున్నాయి. వరి పండిన పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా దర్శనమిస్తున్నాయి. ప్రేమ్‌నగర్, రంగారావుపల్లి, బండారుపల్లి, మాధవరావుపల్లి సరిహద్దు లుగా ఉండగా చుట్టూ ప్రభుత్వ భూములు, గుట్టలు, వాగులు ఉండటంతో పరిమితంగా ఉన్న పట్టా భూములకు ఎక్కడాలేని రేటు వస్తోంది. భూమికి అనూహ్యంగా ధర పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు గజం స్థలాన్ని కూడా వదలడం లేదు. దీంతో పంట పొలాలకు నీళ్లందించే కాల్వలకు ప్రమాదం ఏర్పడింది.
కాల్వలన్నీ కబ్జా..
జిల్లాకేంద్రం చుట్టూ ఉన్న పంట పొలాలకు లోకం చెరువు ప్రధాన జలవనరు. దీని ఆయకట్టులో సుమారు 2,500 ఎకరాలు సాగవుతున్నాయి. రామప్ప సరస్సును ఆనుకొని ఉన్న రంగారావుపల్లి, పాల్ సాబ్‌పల్లి వరకు గల చివరి పొలానికి నీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రధాన కాల్వకు అనుబంఽ దంగా పిల్లకాల్వల నిర్మాణం చేసింది. గరిష్టంగా ఎనిమి ది ఫీట్ల వెడెల్పుతో కాల్వలు తవ్వించగా ఎక్కువ శాతం ఇప్పుడు కనుమరుగ య్యాయి. బండారుపల్లి, రంగారా వుపల్లి వైపు ఉన్న పొలాలకు నీటిని అందించేందుకు జాతీయ రహదారి కింద నుంచి పైపులు వేశారు. ఇప్పుడవి చాలా వరకు కుచించుకుపోయాయి. రోడ్డుకిరువైపులా వెంచర్లు చేయగా కొన్ని చోట్ల కాల్వలను పూర్తిగా మూసివేశారు. మరికొన్ని చోట్ల ఇష్టమొచ్చినట్లు దారి మళ్లించారు. ప్లాట్లు కొన్న వారు నిర్మాణాలు చేసుకోగా కొందరు బిల్డర్లు ఏకంగా కాల్వలపైనే ఇళ్లను కట్టించి అమ్ముకున్నారు. డీఎల్‌ఆర్ ఫంక్షన్‌హాల్, సాధన స్కూల్ సమీపంలో పంటకాల్వ ఆక్రమణ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ముంపునకు గురవుతున్న కాలనీలు
వర్షాకాలంలో శ్రీనివాసకాలనీ, పాత పెట్రోల్‌బంకు వెనుకప్రాంతం, అమరవీరుల స్థూపం, కృష్ణకాలనీ, బాలాజీ థియేటర్ పరిసరాలు ముంపునకు గురవు తున్నాయి. వరదనీరు కిందకుపోయే మార్గం లేకపోవ డంతో రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. గ్రామ పం చాయతీ, రాష్ర ్ట ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి కాల నీల్లో డ్రెయినేజీ నిర్మాణం చేసినా వర్షాకా లంలో ముం పు మాత్రం తప్పడం లేదు. రోజుల తరబడి మరు గునీరు నిల్వ ఉండటంతో పారిశుధ్యం లోపిస్తోంది.
అధికారుల చర్యలు శూన్యం
ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకో వడం లేదు. గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. పలు నిర్మాణాలపై స్థానికులు అభ్యంతరాలు తెలుపు తూ రాతపూర్వకంగా విన్నవించుకున్నారు. ‘చేద్దాం.. చూద్దాం..’ అనే విధంగా యంత్రాంగం వ్యవహరిస్తోం ది. ప్రతీసారి జిల్లా కోర్టు సమీపంలో జాతీయ రహదా రిపైకి వర్షపు నీరు ముంచెత్తుతోంది. అక్కడికి దగ్గరలో మూడుచోట్ల కల్వర్టులు, కాల్వలు అన్యాక్రాంతం కావ డంతో వరద ముందుకు వెళ్లే మార్గం లేక రోడ్డుపై నిలుస్తోంది. డివైడర్‌ను పగలగొట్టి నీటిని కిందకు మళ్లించిన అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. తిరుమల థియేటర్, సాధన స్కూల్ సమీపంలో కూడా కల్వర్టులు, కాల్వల కబ్జా అయినట్లు తేటతెల్ల మైంది. తక్షణ చర్యల కోసం పలు సందర్భాల్లో స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించినా పురోగతి మాత్రం లేదు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి కాల్వల దురాక్రమణకు అడ్డుకట్ట వేయడంతోపాటు డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - 2023-06-26T23:37:29+05:30 IST