ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకు నీళ్లు ఇవ్వండి

ABN, First Publish Date - 2023-02-21T00:44:28+05:30

జిల్లాలో పారుతున్న గోదావరిలో లిఫ్టులు ఏర్పాటు చేసి ములుగు నియోజకర్గంలోని ప్రతి మండలానికీ తాగు,సాగునీటిని అందించాలని ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని కోరారు.

జలసౌధలో చీఫ్‌ ఇంజనీర్‌ మురళీధర్‌కు నియోజకవర్గ సమస్యలు వివరిస్తున్న ఎమ్మెల్యే సీతక్క
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 20: జిల్లాలో పారుతున్న గోదావరిలో లిఫ్టులు ఏర్పాటు చేసి ములుగు నియోజకర్గంలోని ప్రతి మండలానికీ తాగు,సాగునీటిని అందించాలని ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లోని జలసౌధలో జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ మురళీధర్‌ను, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్‌రావును ఆమె సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తుపాకులగూడెం బ్యారేజ్‌ నుంచి కాల్వల ద్వారా కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి మండలాల్లోని గ్రామాల్లో చెరువులను నింపాలని కోరారు. మంగపేట మండలంలోని మల్లూరు వద్ద లిఫ్ట్‌ ఏర్పాటుచేసి మల్లూరు ప్రాజెక్టులోకి గోదావరి నీటిని మళ్లించాలన్నారు. గౌరారం వాగుపై చెక్‌డ్యామ్‌ నిర్మించి చెరుపల్లి పెద్దచెరువులోకి నీటిని మళ్లించడం ద్వారా వేలాది ఎకరాల బీడుభూములు సాగులోకి వస్తాయని తెలిపారు. పాకాల చెరువుపై లిఫ్ట్‌ ఏర్పాటు చేసి ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, పాకాల, గంగారం మండలాల్లోని చెరువులను నింపి రైతులకు సాగునీటిని అందించాలన్నారు. ముస్మిచెరువును రిజర్వాయర్‌గా మార్చి పాకాల చెరువు నుంచి లిఫ్ట్‌ ద్వారా సాగునీరు అందించాలని కోరారు. రామప్ప సరస్సు నుంచి జనగామకు పోతున్న దేవాదుల పైపులైన్‌కు అత్యంత దగ్గర ఉన్న ఇంచెంచెరువుకు గోదావరి జలాలను లిఫ్ట్‌ చేయాలని, గంగారం మండలంలోని పందిపంపుల వాగుపై చెక్‌డ్యామ్‌ నిర్మించాలని అన్నారు. రామప్ప నుంచి పాకాలకు వెళ్తున్న కాల్వకు మార్గమధ్యలో ములుగు మండలం పొట్లాపూర్‌ గ్రామం వద్ద ఎదుళ్లచెరువు వద్ద కెనాల్‌పై ఆఫ్‌టెక్‌ నిర్మిస్తే ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దేవాదుల పైపులైన్‌ ద్వారా జాకారం, ములుగు లోకంచెరువు, అబ్బాపురం చెరువులోకి నీటిని అందించాలని, రామప్ప నుంచి రంగాయచెరువుకు పోతున్న దేవాదుల కాల్వ ద్వారా కొడిశలకుంట ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు మంజూరైన పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రామప్ప నుంచి లక్నవరం వరకు మంజూరైన దేవాదుల పైపులైన్‌ పనులకు భూసేకరణ త్వరితగతిన పూర్తిచేసి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. కన్నాయిగూడెం మండలంలోని కంతనపల్లి గ్రామంలోని పెద్దచెరువుకు తూములు ఏర్పాటుచేసి కాల్వల ద్వారా సాగునీటిని అందించాలని, గోదావరి జలాలను వినియోగించుకునేందుకు కొడిశలకుంట నుంచి రామచంద్రాపురం, మల్లంపల్లి, జాకారం వద్ద లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈపనులకు నిధులు మంజూరైనప్పటికీ పనులు చేపట్టలేదని గుర్తుచేశారు. తుపాకులగూడెం బ్యారేజీ డౌన్‌ స్ట్రీమ్‌ కింద ఉన్న కన్నాయిగూడెం మండలంలో గ్రౌండ్‌వాటర్‌ 600 నుంచి 700 అడుగుల వరకు ఉండడం వల్ల పంట పొలాల్లో వేసిన బోర్లు, మోటార్లు పనిచేయడం లేదని తెలిపారు. టీఎస్‌ఎన్‌డీసీఎల్‌ ద్వారా ప్రత్యేక జీవో విడుదల చేసి పైపులైన్‌ ద్వారా కన్నాయిగూడెం మండల రైతులకు నీళ్లు అందించాలని కోరారు. అదేవిధంగా ములుగు నియోజకవర్గంలోని అనేక వాగులు, తోగులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి చిన్న, సన్నకారు రైతులకు సాగునీటిని అందించాలన్నారు. లక్నవరం చెరువు కాల్వలకు ఇరువైపులా గైడ్‌వాల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట టీపీసీసీ సభ్యుడు పైడాకుల అశోక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-02-21T00:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising