ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సర్కార్‌ బడుల్లో పఠనోత్సవం

ABN, First Publish Date - 2023-06-26T00:57:42+05:30

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 26 నుంచి జూలై 31వ తేదీ వరకు పఠ నోత్సవాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలో 921 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు 102, ప్రాథమి కోన్నత పాఠశాలలు 120, ప్రాథమిక పా ఠశాలలు 676, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు 15, మోడల్‌ స్కూల్స్‌ 8 వెరసి 921 పాఠశాలల్లో 53,999 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుంచి జూలై 31 వరకు..

1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

పాఠశాలల్లో గ్రంథాలయ కమిటీల నియామకం

జూలై 15న తల్లిదండ్రుల సమావేశం

ఉపాధ్యాయులతో కోర్‌ కమిటీ ఏర్పాటు

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, జూన్‌ 25: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 26 నుంచి జూలై 31వ తేదీ వరకు పఠ నోత్సవాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలో 921 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు 102, ప్రాథమి కోన్నత పాఠశాలలు 120, ప్రాథమిక పా ఠశాలలు 676, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు 15, మోడల్‌ స్కూల్స్‌ 8 వెరసి 921 పాఠశాలల్లో 53,999 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ల్లో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి విద్యనభ్యసించే విద్యార్థులు ధా రాళంగా చదవటం అలవాటు చేసుకోవడం... చదువుతూ ఆనందం పొం దడం... స్వతంత్ర పాఠకులుగా ఎదగడం పఠనోత్సవం ప్రధాన లక్ష్యం. ప్రతి విద్యార్థి ఆయా తరగతుల వారీగా కనీస సామర్థ్యాలు సాధించటం తో పాటు పాఠ్యాంశాలను ధారాళంగా చదివేందుకు పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా.. ప్రధానో పా ధ్యాయులు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఇందు లో భాగంగా ప్రతి రోజు పుస్తక పఠనం కోసం ఒక పీరి యడ్‌(లైబ్రరీ) కేటాయించాలి. ప్రతి పీరియడ్‌లో ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని వి ద్యార్థులతో 10నిమిషాలు బాహ్యపఠనం చేయాలి. ఉపాధ్యాయుడు చార్టు లపై లేదా నల్లబల్లపై పదాలను రాసి ప్రదర్శించాలి. అలాగే గ్రంథాలయ పీరియడ్‌లో ప్రతి రోజు విద్యార్థులచే కథల పుస్తకాలు చదివించాలి. సోమ వారం నుంచి శనివారం వరకు మూడు రోజులు మాతృభాషలో, మూడు రోజులు ఆంగ్ల భాషలోని కథల పుస్తకాలు చదివించాలి.

గ్రంథాలయ కమిటీల ఏర్పాటు..

ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయ కమిటీలను ఏ ర్పాటు చేసి వి ద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా పుస్తకాలు గ్రంథాలయం నుంచి ఎంపిక చేసుకొని చదివేలా ప్రోత్స హించాలి. విద్యార్థులు చదివే స్థాయిని బట్టి వా రిని గ్రూపులుగా విభజించి ఒకరికొకరు సహాయం చేసుకునే వి ధంగా అవగాహన కల్పించాలి. ఇంటి వద్ద కూడా విద్యార్థులు చదివేలా గ్రంథా లయ పుస్తకాలతో పాటు రకరకాల మ్యాగ్జిన్‌లు ఇచ్చి వాటిని తల్లిదండ్రు లు చదివి వినిపించమని చెప్పాలి. ప్రతి రోజు ప్రార్థన సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులచే పుస్తకాలను చది వించాలి. చదివే సందర్భంలో వీడియో తీసి పాఠశాలల గ్రూపుల్లో పంపించాలి. అలాగే జిల్లా స్థాయి గ్రూపులకు, రాష్ట్ర స్థాయి గ్రూపులతో పాటు విద్యార్థుల తల్లిదం డ్రులకు పంపించాలి.

పోటీతత్వాన్ని పెంచేందుకు..

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు పఠ నోత్సవం ఎంతగానో దోహదపడుతుంది. అన్ని పాఠశాలల్లో ప్రతి శనివా రం విద్యార్థులకు పఠన పోటీలు నిర్వహించాలి. ప్రతి నెలలో మూడో శనివారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థులచే చదివించి బాగా చదివిన వారిని అభినందించాలి. ఇంటి వద్ద కూడా చదివేలా ప్రో త్సహించాలని తల్లిదండ్రులకు సూచించాలి. విద్యార్థుల పుట్టిన రోజు సంద ర్భంగా వారికి బహుమతులుగా పుస్తకాలను ఇవ్వాలి. స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, సభ్యులను ఇందుకోసం వినియోగించుకోవాలి. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జూలై 10 నుంచి 15 వరకు గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలి.

జూలై 15న తల్లిదండ్రుల సమావేశం..

జూలై 15న అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశా న్ని నిర్వహించి ప్రముఖులను ఆహ్వానించాలి. ప్రతి ఉపా ధ్యాయుడి వద్ద తమ తరగతిలో వారి వారి సబ్జెక్టులో ఎంత మంది విద్యార్థులు ధారాళంగా చదువుతారు.. ఎంత మంది నెమ్మదిగా చదువుతారు.. ఎంత మంది వెనుకబడి ఉన్నారు... తదితర వివరాలు కలిగి ఉండాలి. ప్రధానోపా ధ్యాయుల వద్ద మొత్తం పాఠశాలకు సంబంధించిన వివరా లు ఉండాలి. కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు తమ పరిధి లోని అన్ని పాఠశాలలను నెలకు ఒకసారి కనీసంగా సంద ర్శించి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, కాంప్లెక్స్‌ సమావేశా ల్లో వీటిపై సమీక్షించాలి. మండల విద్యాధికారులు, నోడల్‌ అధికారులు తొలిమెట్టులో సూచించిన విధంగా వివిధ పా ఠశాలలను సందర్శించినప్పుడు పఠన కార్యక్రమాన్ని పర్య వేక్షణ చేయాలి.

ఉపాధ్యాయులతో కోర్‌ కమిటీ

మండల, జిల్లా స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులతో కోర్‌ కమిటీ టీం ఏర్పాటు చేసి వారు ఒక వాట్సాప్‌ గ్రూపు ద్వారా కథలు, గేయాలు, ఆడి యో స్టోరీస్‌ మొదలైన వాటిని పాఠశాలలకు పంపే విధం గా చూడాలి. మండల, జిల్లా స్థాయిలో నెలకొకసారి మండ ల విద్యాధికారులు, నోడల్‌ అధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానో పాధ్యాయులతో సమీక్ష నిర్వహించాలి. ఇందులో డైట్‌ లెక్చ రర్స్‌ను భాగస్వాములు చేయాలి. రాష్ట్ర స్థాయిలో ఎస్సీఈఆర్టీ, సమగ్ర శిక్ష అధికారులు వివిధ జి ల్లాల్లో పర్యవేక్షిస్తారు. పఠనోత్సవాన్ని విజయవం తంగా నిర్వహిస్తే తొలిమెట్టు ద్వారా ప్రభుత్వం ఆశించే ఫలితాలను మరింత తొందరగా చేరు కునేందుకు దోహదపడి లక్ష్యం నెరవేరుతుంది.

Updated Date - 2023-06-26T00:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising