తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శం
ABN, First Publish Date - 2023-03-26T00:24:04+05:30
అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి
రూ. 40 వేల కోట్లతో ఇంటింటికీ తాగునీరు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
గ్రామపంచాయతీలకు ఉత్తమ అవార్డుల ప్రదానం
జనగామ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవార్డుల్లో ఎక్కువ శాతం తెలంగాణకే వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 20 అవార్డు లు అందిస్తే అందులో 19 తెలంగాణకే రావడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ ప్రణాళిక, ముందుచూపుతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ‘దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సూచించిన ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’కు సంబంధించి 9 అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు శనివారం అవార్డుల ప్రదానం చేశారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందుతో పోలిస్తే ప్రస్తుతం గ్రామాల స్వరూపం మారిపోయిందని అన్నారు. అప్పట్లో జీపీకి వచ్చే ఆదాయమంతా తాగునీటి కోసమే వెచ్చించే పరిస్థితి ఉండేదన్నారు. సర్పంచులపై తాగునీటి నిర్వహణ భారం ఉండొద్దన్న ఆలోచనతో రూ. 40 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. శ్మశానవా టికలకు దారి లేక, అంత్యక్రియల అనంతరం స్నానాని కి నీరు లేక అవస్థలు పడ్డ సందర్భాలు గతంలో ఉండేవని, వైకుంఠధామాల నిర్మాణం జరిగాక గౌరవ ప్రదమైన అంత్యక్రియలు జరుగుతున్నాయని పేర్కొ న్నారు. ప్రతి గ్రామ పంచాయతీకీ ట్రాక్టర్‌ను అందించడం ద్వారా చెత్త సేకరణ, మొక్కలకు నీరు పోయడం వంటి పనులు చేసుకోగలుతున్నారన్నారు. అర్థిక సంఘం కింద కేంద్రం ఇస్తున్న నిధుల కంటే ఎక్కువగా రాష్ట్రం ఇస్తోందని అన్నారు. జిల్లాలో 107 జీపీల కొత్త భవన నిర్మాణాలకు గానూ రూ.21.40 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా అవార్డులు పొందిన వాటికి ఏప్రిల్ తర్వాత రూ. 10 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఉపాధి హామీని ఎత్తేసే కుట్ర
ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని మంత్రి దయాకర్‌రావు విమర్శించారు. ఉపాధి హామీ పనిదినాలను 13 కోట్ల నుంచి 7 కోట్లకు తగ్గించిందని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో ఉపాధి హామీని ఎత్తేసిందని విమర్శించారు. తెలంగాణలో నిర్మించిన రైతు కల్లాల విషయంలో కొర్రీలు విధించి వైకుంఽఠధామాలు, పల్లె ప్రకృతి వనాల బిల్లులను కేంద్రం నిలిపివేసిందని మండిపడ్డారు. కేంద్రం సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు మూర్ఖులు
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మూర్ఖుల్లాగా మాట్లా డుతున్నారని మంత్రి విమర్శించారు. పంట నష్ట పరిహారం విషయంలో హెక్టారుకు రూ.5 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం జీవో జారీ చేసిందని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఎకరాకు రూ.10 వేలు, హెక్టారుకు రూ.25 వేల చొప్పు న అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
జిల్లాలో 9 కేటగిరీలలో ఒక్కో కేటగిరీ నుంచి మూడు నుంచి ఐదు ఉత్తమ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా కొన్ని గ్రామ పంచాయతీలకు రెండు కేటగిరీలలో సైతం అవార్డులు వచ్చాయి. కేటగిరీల వారీగా ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలు పొందిన గ్రామ పంచాయతీల వివరాలు..
Updated Date - 2023-03-26T00:24:04+05:30 IST