మక్క రైతులకు ఊరట
ABN, First Publish Date - 2023-05-02T23:48:35+05:30
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు, మొక్క జొన్నలకు మద్దతు ధర రాని పరిస్థితులో ప్రభుత్వమే మక్కల కొనుగోలుకు కేంద్రాలను సిద్ధం చేస్తుండడంతో రైతుకు ఊరట కలుగుతోంది. ఇప్పటికే జిల్లా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రా రంభానికి సిద్ధమయ్యాయి. మొక్కజొన్నలు ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కు వ ధర పలుకుతుండడంతో మక్కల రైతులు ఆందోళనతో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధరతో ఖరీదులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఆదేశించారు.
నేడో.. రేపో కొనుగోలు కేంద్రాల ప్రారంభం
ముందుగా బయ్యారంలో ఓపెన్
జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాలు
ప్రభుత్వ మద్దతు ధర రూ.1,962
మహబూబాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి) : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు, మొక్క జొన్నలకు మద్దతు ధర రాని పరిస్థితులో ప్రభుత్వమే మక్కల కొనుగోలుకు కేంద్రాలను సిద్ధం చేస్తుండడంతో రైతుకు ఊరట కలుగుతోంది. ఇప్పటికే జిల్లా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రా రంభానికి సిద్ధమయ్యాయి. మొక్కజొన్నలు ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కు వ ధర పలుకుతుండడంతో మక్కల రైతులు ఆందోళనతో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధరతో ఖరీదులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో నేడో.. రేపో ముందుగా బయ్యారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి త ర్వాత జిల్లాలోని ఇతర కేంద్రాల్లో ప్రారంభించడానికి జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటి వరకు రైతుల వద్దనున్న మొక్కజొన్నలను ఖరీదు చేపడుతారు.
కొనుగోళ్లు ఇలా..
కేసముద్రం, మహబూబాబాద్ వ్యవసాయ మా ర్కెట్లలో గత మార్చి నెల నుంచి మక్కల ధరలు త గ్గుముఖం పట్టాయి. మక్కలు గత మార్చి నెలలో రూ.2078 నుంచి రూ.2100 వరకు ఉండగా ఏప్రిల్ నెలలో రూ.1749 నుంచి రూ.1849 వరకు ధరలు ప లికాయి. అత్యధికంగా రూ.1700తోనే అధికంగా మక్క లు కొనుగోలు చేశారు. దీంతో రైతులు ప్రభుత్వ మద్ద తు ధర రాక రైతులు నష్టపోయారు. ఇదే మార్కెట్ లో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. దీంతో కేసీఆర్ స్పం దించి మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగానే జిల్లాలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు.
వ్యవసాయ పోర్టల్‌లో నమోదై ఉంటేనే..
రైతు సమగ్ర సమాచార పోర్టల్‌లో మొక్కజొన్నలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు నమోదు చేసుకుంటేనే రైతులకు మక్కల కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే వీలును ప్రభుత్వం కల్పించింది. దీని ద్వారా దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతులు తమ వెంట పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డుతో వ్యవసాయ విస్తీర్ణ అధికారి వద్దకు వెళ్లి టోకెన్ తీసుకున్న తర్వాతనే మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రాలకు తరలించాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం మక్కలకు తేమశాతంతో పాటు నాణ్యతగా ఉండేందుకు పూర్తిగా ఎండబెట్టి ఉంటేనే నిర్వాహకులు మక్కలను కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తా రు. ఆ తర్వాత నేరుగా రైతులకు రైతుబంధు ఖాతాల్లో ఆ ఆకౌంట్లలోనే ప్రభుత్వం నగదు జమ చేస్తుంది.
జిల్లాలో 37 కేంద్రాలు
జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 20, ఓడీసీఎంఎస్ వరంగల్ ఆధ్వర్యంలో 8, జీపీసీఎంఎస్ నర్సంపేట ఆధ్వర్యంలో 6, ఐకేపీ ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా కు రూ.1962 చొప్పున ధర ఖరారు చేశారు. రైతులు ఎక్కువగా పండించిన ప్రాంతాల్లోనే రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్ అధికా రులు చెబుతున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతున్న తరుణంలో వ్యవసాయ మార్కెట్లలో, బయటి ప్రైవేట్ మార్కెట్లలో మక్కలకు డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఖరీఫ్ వరకు కొనుగోళ్లు
2019-20 ఆర్థిక సంవత్సరం కరోనా సీజన్‌లో 61వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్ ఖరీదు చేసింది. 2020-21 ఖరీఫ్‌లో 16,670 మెట్రిక్ టన్నులను ఖరీదు చేశారు. ఆ తర్వాత మొక్కజొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా పలుకుతుండడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం మక్కలకు ధరలు తగ్గడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పా టుకు అధికారులు సిద్ధమయ్యారు. మొక్కజొన్నలు ఎంత మేరకు ఖరీదు చేయాలనే టార్గెట్‌ను ప్రభుత్వం విధించలేదు. రైతు వద్ద ఉన్న మొక్కజొన్నలు అయిపోయేంత వరకు ఖరీఫ్ సీజన్ వచ్చేంత వరకు మక్కలు కొనుగోలు చేస్తారు. జిల్లాను రెండు సెక్టార్లుగా విభజించారు. ఏజెన్సీ ఏరియా సెక్టార్-1గా, అర్బన్ ఏరియాను సెక్టార్-2 ఏర్పాటు చేసి మక్కలు ఖరీదు చేస్తారు. ఇందుకనుగుణంగా ఇంతకు ముందు ఉపయోగించిన గొనె సంచులను సిద్ధం చేసి గూడూరులోని ఓ గోదాంలో మక్కలు భద్రపరిచేందుకు నిర్ణయించారు. కొనుగోలు చేసిన మక్కలను తరలించేం దుకు ట్రాన్స్‌పోర్టు టెండర్లు పూర్తయ్యాయి.
కేసముద్రం మండలంపై..
కేసముద్రం మండలంలో మక్కలు ఖరీదు చేసిన సమయంలో దళారుల బెడద ఎక్కువగా ఉందన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. చివరి కొనుగోళ్ల సమయంలో దళారులు, పలువురు కొనుగోలుదారులు ఏకమై కొన్ని మక్కలను బయట తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులపేర్లపై ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారన్న అభియోగాలు విన్పించాయి. ఈ నేపథ్యంలోనే రేపటి రోజుల్లో దళారుల బెడద లేకుండ సక్రమంగా నిజమైన రైతుల మొక్క జొన్నలను కొనుగోలు చేసే విధంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవచూపాలని రైతులు కోరుతున్నారు.
పాస్‌పుస్తకం లేకున్నా కొనాలి..: జర్పుల లక్ష్మి, మహిళా రైతు, కొత్తపల్లి (కొత్తగూడ)
వ్యవసాయాధికారుల పోర్టల్‌లో నమోదై ఉన్న మొక్కజొన్నల సాగును పట్టాదారు పాస్‌పుస్తకా లు లేకున్న ప్రభుత్వ ఉ దాసీనతగా వ్యవహారించి కొనుగోలు చేపట్టాలి. ఇటీవల అకాల వర్షాలు అధికమై ఉన్నందున మొక్కజొన్నలు తడిసి రైతులు నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి మక్కలకు ఎలాంటి తిరకాసు పెట్టకుండ ఖరీదులు చేపట్టాలి. దానివల్ల రైతులకు ప్రభుత్వం న్యాయం చేసినట్లవుతుంది.
కేంద్రం ఏర్పాటు హర్షించదగ్గ విషయం : పట్టగంటి సత్యనారాయణ, బయ్యారం
ప్రభుత్వం ధాన్యం మా దిరి మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం హర్శించదగ్గ విషయం. 5 ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నాను. బయట దళా రులను ఆశ్రయిస్తే ఇష్టమొచ్చినట్లు ధర అడు గుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే మక్క రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చేది.
మక్కలను ఎండబెట్టి తీసుకురావాలి : ఐలోని శ్యాంకుమార్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ శశాంక నేతృత్వంలో జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ వర్షం తగితే నేడో.. రేపో ముందుగా ఏజెన్సీ ఏరియా అయినా బయ్యా రంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ మద్దతు రూ.1962. ప్రభుత్వ నిబంధన ప్రకారం 14 శాతం తేమశాతం ఉండి, చెత్తచెదారం లేకుండ బెండ్లు లేకుండ మక్కలను శుభ్ర పరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. పూర్తిగా నాణ్యతగా ఉంటేనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది.
Updated Date - 2023-05-02T23:48:35+05:30 IST