Warangal: కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్
ABN, First Publish Date - 2023-09-17T09:20:23+05:30
వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలంరేగింది. సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి మనోహర్‌ను థార్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి, దాడి చేశారు.
వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీ (Kakatiya Medical College)లో ర్యాగింగ్ (Raging) కలకలంరేగింది. సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి మనోహర్‌ను థార్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి, దాడి చేశారు. థార్డ్ ఇయర్ చదువుతున్న సాయికిరణ్ అనే విద్యార్థి బర్త్ డే సందర్భంగా సీనియర్ విద్యార్థులు కేక్ కట్ చేసి హంగామా చేశారు. ఈ క్రమంలో అటువైపు నుంచి వెళ్తున్న జూనియర్ విద్యార్థి మనోహర్‌ను అడ్డుకుని వేధించి, దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సాయికిరణ్ సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. 14వ తేదీ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్, యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరుపుతోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-09-17T09:20:23+05:30 IST