కంటి వెలుగుకు సన్నద్ధం
ABN, First Publish Date - 2023-01-18T00:01:04+05:30
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు రెండో విడతకు ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేసింది. 19 నుంచి ప్రారంభమయ్యే పరీక్ష శిబిరాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండల కేంద్రాలు, గ్రామాలతో పాటు వరంగల్ నగర పరిధిలోని అర్బన్ హెల్త్ సెంట ర్ ప్రాంతాలు డివిజన్లలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించను న్నారు.
రేపటి నుంచి రెండో దశ ప్రారంభం
జిల్లా వ్యాప్తంగా 3,127 శిబిరాలు
44 బృందాలు... ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు
13 పీహెచ్‌సీలు, 8 అర్బన్ సెంటర్లలో పరీక్షలు
వరంగల్ కలెక్టరేట్, జనవరి 17: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు రెండో విడతకు ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేసింది. 19 నుంచి ప్రారంభమయ్యే పరీక్ష శిబిరాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండల కేంద్రాలు, గ్రామాలతో పాటు వరంగల్ నగర పరిధిలోని అర్బన్ హెల్త్ సెంట ర్ ప్రాంతాలు డివిజన్లలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించను న్నారు. అవసరమైన వారికి కళ్ల జోడు అందించడం, వీలైతే ఆపరేషన్లు కూడా చేయించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షల అ నంతరం కళ్లజోడు అందించడానికి ముందస్తుగానే కంటి వెలుగు శిబిరా లను కళ్ల జోడ్లను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 44 బృందాలను ఏర్పాటు చేసి 3,127 శిబిరాలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో నిర్వహించాలని ఉన్నతాధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ప్రతీ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని 100 రోజుల పాటు నిర్వహించా లని జిల్లావ్యాప్తంగా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లా నగర పరిధి ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో 9,97,529 మంది ప్రజలు ఉన్నారు. వీరిలో 18 సంవత్సరాలుపై బడిన వారికి కంటి వెలుగు శిబిరాల ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు.
జిల్లాలో 44 టీమ్స్ ఏర్పాటు..
కంటి వెలుగు పరీక్ష నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా 44 టీమ్స్‌ను ఏర్పాటు చేశా రు. ఒక్కో టీంలో 10మంది ఉంటారు. ఇందు లో మెడికల్ డాక్టర్, కంటి డాక్టర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒక్కొక్కరు, నలుగురు ఆశా లు, ముగ్గురు ఏఎన్‌ఎంలు ఉంటారు.
ప్రతీ టీమ్‌కు వాహనం..
జిల్లాలో, నగర పరిధిలో కంటి వెలుగు శిబిరాలు నిర్వ హించడానికి 44 వాహనాలను ఈ టీమ్స్‌కు ప్రభుత్వం ఏ ర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా వంద రోజుల పాటు నిర్వహించనున్నారు. 408 క్యాంపుల ను ఏర్పాటు చేసి పరీక్షలు నిర ్వహిస్తారు. గ్రామీణ ప్రాం తాల్లో ప్రతీ రోజు 300 మందికి పరీక్షలు చేస్తారు. నగర పరిధిలో 400 మందికి పరీక్షలు చేస్తారు.
75 వేల కళ్లజోళ్ల సరఫరా..
జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన వారందరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు కంటి అద్దాలు అందించాలని, అందుకు గాను ప్రభుత్వం జిల్లాకు 75 వేల కళ్ల జోళ్లను పంపించింది. పరీక్షలు నిర్వహించుకొనే ప్రతీ ఒక్కరు తమ వెంట ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకొని వెళ్లాలని, ఫోన్ నంబర్‌ను సిబ్బందికి చెప్పాల్సి ఉంటుందన్నారు.
Updated Date - 2023-01-18T00:01:06+05:30 IST