ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు

ABN, First Publish Date - 2023-03-02T00:23:08+05:30

ప్రధాని మోదీ దేశ సంపదను తన స్నేహితులైన అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నాడని, ప్రజలు వీరి ఆగడాలను గుర్తిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.

సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అదానీ, అంబానీలకు దేశసంపద దోచిపెడుతున్నారు...

15న వరంగల్‌లో రాజకీయ జాతా

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

హనుమకొండ క్రైం, మార్చి 1: ప్రధాని మోదీ దేశ సంపదను తన స్నేహితులైన అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నాడని, ప్రజలు వీరి ఆగడాలను గుర్తిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. బుధవారం హనుమకొండలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అన్నివర్గాల ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుందని, మత రాజకీయాల ఆటలు చెల్లవని హెచ్చరించారు. కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 15న వరంగల్‌ నగరంలో నిర్వహించే రాజకీయ జాతాకు ప్రజలు పెద్దఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.

కార్మికులకు పని భద్రత కల్పించకపోగా వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగంతో యువత కొట్టుమిట్టాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కొంత ప్రజలకు మేలు చేసే పథకాలను ప్రజల్లో పెట్టి ఊరటనిస్తుందన్నారు. ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ కాచుకుని కూర్చుందని రానున్న ఎన్నికల్లో దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కన్వీనర్‌ బొట్ల చక్రపాణి, జిల్లా కమిటీ సభ్యులు వాసుదేవరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చుక్కయ్య, ఉప్పలయ్య, వెంకట్‌, రాములు, మంద సంపత్‌, తిరుపతి, లింగయ్య, దీప, మిశ్రీన్‌ సుల్తానా పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:23:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!