ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకం ప్రకారమే పవన్‌పై దాడి

ABN, First Publish Date - 2023-02-24T00:17:51+05:30

యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు తోట పవన్‌పై పథకం ప్రకారమే జరిగిందని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి వెల్లడించారు. దాడికి పాల్పడిన వారికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మాజీ కార్పొరేటర్‌ విజయ్‌భాస్కర్‌, కార్పొరేటర్‌ సోదా కిరణ్‌ల ప్రోద్బలం ఉందన్నారు. నిందితులను నిష్పక్షపాతంగా విచారిస్తే అసలు సూత్రధారాలు బయటపడతారన్నారు. ఈ మేరకు సీపీ రంగనాథ్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆధారాలను ప్రదర్శిస్తున్న జిల్లా కాంగ్రెస్‌ నాయకులు రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాడి చేసిన వారంతా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే..

అసలు సూత్రధారులను సీపీ బయటకు లాగాలి

దాడి ఆధారాలు మా వద్ద ఉన్నాయి..

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి

హనుమకొండ సిటీ, ఫిబ్రవరి 23 : యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు తోట పవన్‌పై పథకం ప్రకారమే జరిగిందని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి వెల్లడించారు. దాడికి పాల్పడిన వారికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మాజీ కార్పొరేటర్‌ విజయ్‌భాస్కర్‌, కార్పొరేటర్‌ సోదా కిరణ్‌ల ప్రోద్బలం ఉందన్నారు. నిందితులను నిష్పక్షపాతంగా విచారిస్తే అసలు సూత్రధారాలు బయటపడతారన్నారు. ఈ మేరకు సీపీ రంగనాథ్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడారు.

ఈనెల 20న కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సభలో తోట పవన్‌పై దాడి చేసిన నిందితులు అభిలాష్‌, సుమన్‌, క్రిష్ణా, నరేందర్‌ తదితరులు బీఆర్‌ఎస్‌కు చెందిన వారేనని ఆరోపించారు. వీరికి బీఆర్‌ఎస్‌ నేతల అండదండలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఈమేరకు తాము ఆధారాలు కూడా సేకరించామని ఫొటోలు, సీసీ ఫుటేజీలను ప్రదర్శించారు. రంజిత్‌రెడ్డి, టెంట్‌హౌస్‌ విజయ్‌ల నేతృత్వంలో దాడి జరిగిందని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాల న్నారు. దాడి ఘటనపై కుడా చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలు పక్కదారి పట్టించేలా ఉన్నాయని రాజేందర్‌రెడ్డి అన్నారు. పదవుల కోసం వాస్తవాలను కప్పిపుచ్చడం సరి కాదన్నారు. దాడులకు బెదిరేదిలేదని రాజేందర్‌రెడ్డి వాఖ్యానించారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న పవన్‌కు ఏమి జరిగినా చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని రాజేందర్‌రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్‌ నేతల అన్యాయానికి గురైన వారంతా ముందుకు వస్తే వారి వెంట ఉండి న్యాయం జరిగేలా పోరాడుతామన్నారు.

ఆరాచకాలు సృష్టిస్తున్నారు : మాజీ మేయర్‌ స్వర్ణ

బీఆర్‌ఎస్‌ నేతలు వరంగల్‌ నగరాన్ని రౌడీలకు అడ్డాగా మార్చి అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం చురుగ్గా పని చేస్తే వారిపై దాడులకు బీఆర్‌ఎస్‌ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడులు జరిపితే సహించేది లేదన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం యువతను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దాడులకు పాల్పడితే బీఆర్‌ఎస్‌ నేతలు ఉండేవారా అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి మృతిపై కాంగ్రెస్‌ నేతలు సంతాపం ప్రకటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సమావేశంలో నమిండ్ల శ్రీనివాస్‌, కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమాన్‌తో పాటు బంక సరళ, బొమ్మతి విక్రమ్‌, డాక్టరు పెరుమాండ్ల రామక్రిష్ణ, రాజ్‌కుమార్‌, లక్ష్మీప్రసాద్‌, నసీం జహాన్‌, దొంతి సుదర్శన్‌రెడ్డి, అంకుశ్‌, ఉపేందర్‌, లలిత తదితర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-24T00:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising