ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాహితీవేత్త ‘నమిలికొండ’ కన్నుమూత

ABN, First Publish Date - 2023-03-31T00:20:50+05:30

ప్రముఖ సాహితీ వేత్త, న్యాయవాది నమిలికొండ బాలకిషన్‌రావు(73) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం హనుమకొండలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బాలకిషన్‌రావుకు భార్య గోకుల్‌ రాణి, కుమారుడు డాక్టర్‌ పాంచాల్‌రాయ్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎందరో వర్ధమాన రచయితలకు చేయూత

పలు సంస్థలకు బాధ్యుడిగా చురుకైన పాత్ర

సంతాపం తెలిపిన పలువురు సాహిత్యకారులు

హనుమకొండ, మార్చి 30 (ఆంద్రజ్యోతి) : ప్రముఖ సాహితీ వేత్త, న్యాయవాది నమిలికొండ బాలకిషన్‌రావు(73) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం హనుమకొండలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బాలకిషన్‌రావుకు భార్య గోకుల్‌ రాణి, కుమారుడు డాక్టర్‌ పాంచాల్‌రాయ్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాహితీ లోకానికి నబారాగా సుపరిచితుడైన నమిలికొండ బాలకిషన్‌రావు.. 1950లో కరీంనగర్‌ జిల్లా పూడూరులో రత్నాబాయి - నారాయణరావు దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. జగిత్యాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన హనుమకొండలో స్థిరపడ్డారు. ఎంఏ చేసిన తర్వాత ఎల్‌ఎల్‌బీలో పట్టా పొంది న్యాయవాద వృతితో పాటు డాక్యుమెంట్‌ రైటర్‌గా సుప్రసిద్ధులయ్యారు. సుప్రసిద్ధ కవి దేవులపల్లి రామాజరావు, కాళోజీ సోదరులు రామేశ్వర్‌రావు, నారాయణరావులతో పాటు చేతనావర్త కవులతో నబారాకు ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి. శాయంపేట హవేలిలోని కాకతీయుల కాలం నాటి అత్యంత పురాతనమైన పాంచాలరాయ స్వామి దేవాలయం జీర్ణోద్ధరణకు బాలకిషన్‌ ఎంతో కృషి చేశారు. పాంచాలరాయ స్వామికి పరమ భక్తుడు. ఆందుకే ఆయన కుమారుడికి పాంచాలరాయ్‌ అని పేరుపెట్టారు.

అనేక పుస్తకాలు రాసి కవిగా, రచయితగా సుప్రసిద్ధలయ్యారు. అనేక మంది వర్ధమాన కవుల రచనలను అచ్చు వేయించి సాహితీలోకానికి పరిచయం చేశారు. అనేక సాహిత్య, సాంస్కృతిక సంస్థలతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. చైతన్య సాహితీ కోశాదికారిగా, సాంస్కృతిక సమాఖ్య, సాహితీ సమితిలను 1984లో స్థాపించి అధ్యక్షుడిగా కొనసాగారు. 1982లో ప్రసారిక ఆధునిక సాహిత్య పత్రికను ప్రారంభించి తుదిశ్వాస విడిచే వరకు దానిని కొనసాగిస్తూ వచ్చారు. నబారా సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేసి ఎందరో రచయితలను సత్కరించారు.

కవిగా యువస్వరం, అక్షర చిత్రాలు, శాంతి సమత, అక్షరాల్లో అనంతం, అక్షర ప్రతిబింబాలు, ప్రసారకీయ కుసుమాలు, (సంపాదకీయాలు), అక్షర స్పందన (పు స్తక పరిచయాలు) తదితర పుస్తకాలను వెలువరించా రు. బాలకిషన్‌రావు రచనలపై రెండు విమర్శక గ్రంథా లు వెలువడడం విశేషం. సాహితీ మిత్రుల పుస్తకాల ను వెలువరించడంలో ఆయన వీలైనంత మేరకు సహా య సహకారాలు అందించేవారు. వరంగల్‌ పోతన విజ్ఞాన పీఠం కార్యదర్శిగా, రాజరాజ నరేంద్రాద్ర భాషా నిలయం సభ్యుడిగా వాటి అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.

పలువురి సంతాపం

బాలకిషన్‌ రావు మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు సంతాపం వెలిబుచ్చారు. నమిలికొండ మృతి సాహితీలోకానికి తీరని లోటని ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, డాక్టర్‌ టి.రంగస్వామి, కవి వీఆర్‌ విద్యార్థి, కాళోజీ ఫౌండేషన్‌ వ్యవస్ధాపక అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్‌, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహర్‌ బాబు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌వీఎన్‌ చారి, సాహిత్య సాంస్కృతిక కార్యదర్శులు కుందావఝ్జుల క్రిష్ణమూర్తి, వనం లక్ష్మీకాంతారావు సంతాపం ప్రకటించారు. కాగా, బాలకిషన్‌రావు అంత్యక్రియ లు పద్మాక్షికాలనీలోని శివముక్తిధామ్‌లో జరుగుతాయని కు టుంబసభ్యులు తెలిపారు.

Updated Date - 2023-03-31T00:20:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising