ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్నికలున్నామేడారం జాతర పనులు ఆగవు

ABN, First Publish Date - 2023-09-22T00:32:24+05:30

అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా మేడారంలో మహాజాతర అభివృద్ధి పనులు ఆగవని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి గురువారం పర్యటించారు. దేవస్థానం వెనుక హెలిప్యాడ్‌ పరిసరాల్లో రూ. 2.15 కోట్లతో 1,500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మేడారం ఐటీడీఏ అతిథి గృహంలో అధికారులతో సమావేశమయ్యారు. 2024 ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్షించారు.

మేడారంలో దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌

నిర్వహణకు రూ.75 కోట్లతో ప్రతిపాదనలు

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

అధికారులతో సమీక్ష... వనదేవతలకు మొక్కులు

దేవాదాయశాఖ సమీకృత భవన సముదాయానికి శంకుస్థాపన

మేడారం, సెప్టెంబరు 21: అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా మేడారంలో మహాజాతర అభివృద్ధి పనులు ఆగవని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి గురువారం పర్యటించారు. దేవస్థానం వెనుక హెలిప్యాడ్‌ పరిసరాల్లో రూ. 2.15 కోట్లతో 1,500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మేడారం ఐటీడీఏ అతిథి గృహంలో అధికారులతో సమావేశమయ్యారు. 2024 ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేసున్నామని, నిర్వహణకు రూ.75 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు.

దేవాదాయ సమీకృత భవన సముదాయంతో పాటు రూ. 6కోట్లతో పరిపాలన భవనం, వీవీఐపీ గెస్ట్‌హౌస్‌, రూ. 2 కోట్లతో డార్మిటరీ హాల్‌, రూ.కోటి 50లక్షలతో పూజారుల అతిథి భవనం, రూ. కోటి 6లక్షలతో శుభద మండపం, రూ. 94 లక్షలతో కన్నెపల్లిలో సమ్మక్క పూజా మందిరం, రూ. 94 లక్షలతో కన్నెపల్లిలో సారలమ్మ పూజా మందిరం, రూ. 50 లక్షలతో జంపన్నవాగు పరిసర ప్రాంతంలో దేవాదాయ శాఖ స్థలంలో పాఠశాల భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. మరో 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. ఎన్నికల హడావిడి ఉన్నా మహా జాతర పనులు మాత్రం ఆగవని స్పష్టం చేశారు.

మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ మేడారం జాతర నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ప్రాముఖ్యానిస్తున్నారని అన్నారు. స్వరాష్ట్ర సాధన అనంతమే మేడారం అభివృద్ధి సాధ్యమైందన్నారు. నాలుగు జాతరలకు రూ. 400 కోట్లతో మేడారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి చేశారని అన్నారు. 2024 ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు జరిగే జాతరను గొప్పగా చేసుకుందామన్నారు. అధికారులు చాలెంజింగ్‌గా తీసుకొని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అన్నారు. జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలన్నారు.

వనదేవతలకు మొక్కులు

వనదేవతలను మంత్రలు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌ దర్శించుకున్నారు. వారికి పూజారులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తల్లుల గద్దెలకు మంత్రులు నిలువెత్తు బంగారం(బెల్లం), చీరె, సారె, పూలు పండ్లు, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించారు.

ఈ కార్యక్రమాల్లో రెడ్కో చైర్మన్‌ వై.సతీ్‌షరెడ్డి, రోడ్డు భవనాల సంస్థ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌, దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, ములుగు జడ్పీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్‌, ఎస్పీ గాష్‌ఆలం, తహసీల్దార్‌ రవీందర్‌, మేడారం దేవస్థానం కార్యనిర్వణాధికారి రాజేంద్రం, పూజారల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, మేడారం సర్పంచ్‌ చిడం బాబురావు, దేవాదాయ శాఖ ఎస్‌ఈ మల్లికార్జున్‌రెడ్డి, ఈఈ దుర్గాప్రసాద్‌, డీసీ శ్రీకాంత్‌రావు, ఏసీ సునీత తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ములుగు జిల్లా కేంద్రంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ సముదాయాన్ని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.

Updated Date - 2023-09-22T00:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising