ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నగరాల సరసన మరిపెడ బంగ్లా

ABN, First Publish Date - 2023-06-26T00:59:04+05:30

అభివృద్ధిలో మరిపెడ బంగ్లా నగరాల సరసన చేరిందని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌ అన్నారు. మరిపెడలో ఆదివారం ఆయన పీఏసీఎస్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కూన్యాతండా గిరిజనులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

మరిపెడలో పీఏసీఎస్‌ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోత్‌ రెడ్యానాయక్‌

మునిసిపాలిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

మరిపెడ, జూన్‌ 25: అభివృద్ధిలో మరిపెడ బంగ్లా నగరాల సరసన చేరిందని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌ అన్నారు. మరిపెడలో ఆదివారం ఆయన పీఏసీఎస్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కూన్యాతండా గిరిజనులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మరిపెడ మునిసిపల్‌ పరిధిలోని 6, 7, 11, 12, 13, 14వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి ఆయా ఆవాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ మాట్లాడారు. మరిపెడను పంచాయతీ నుంచి మునిసిపల్‌కు అప్‌గ్రేడ్‌ చేయించి రూ.45 కోట్లు అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నట్లు చెప్పారు. అర్బన్‌ డెవలప్‌ కింద రూ.20 కోట్లు, సీఎం డెవలప్‌ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లు తెచ్చి సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, రోడ్డు డివైడర్లు, సీసీరోడ్లు, ఆడిటోరియం, మోడల్‌ మార్కెట్‌, డ్రైనేజీ కాల్వలు తదితర అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వివరించారు. రూ.25 కోట్లతో చేపట్టే అభివృద్ధి పథకాల గురించి చెప్పారు. ప్రతీ గల్లీకి సీసీరోడ్డు ఏర్పాటు కోసం వార్డు కొక్కంటికి రూ.65 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. స్తంభాలు లేని చోట స్తంభాలను ఏర్పాటు చేయడానికి రూ.2.50 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నవీన్‌రావు, డీసీసీబీ డైరెక్టర్‌ చాపల యాదగిరిరెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సింధూరకుమారి, కమిషనర్‌ రాజు, వైస్‌ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, ఎంపీపీ అరుణరాంబాబు, జడ్పీటీసీ శారదరవీందర్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, ఓడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోత్‌ వెంకన్న, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రఘురామ్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు వుప్పల నాగేశ్వర్‌రావు, వార్డు కౌన్సిలర్లు వూరుకొండ శ్రీనివాస్‌, రేఖ లలిత వెంకన్న, మాచెర్ల స్రవంతిభద్రయ్య, ఎస్కే.మక్సూద్‌, దిగిజర్ల శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ సీఈవో నగేశ్‌, మునిసిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising