ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మల్లిక సారాబాయి నృత్య ప్రదర్శన

ABN, First Publish Date - 2023-01-21T00:18:51+05:30

బాలసముద్రంలోని ‘కుడా’ మైదానంలో ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి డాక్టర్‌ మల్లిక సారాబాయి నృత్య ప్రదర్శన శనివారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసినట్లు చీఫ్‌విప్‌ వినయ భాస్కర్‌ తెలిపారు. బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టీ సభ్యుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ బీవీ పాపారావు మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వడ్డెపల్లి, జనవరి 20: బాలసముద్రంలోని ‘కుడా’ మైదానంలో ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి డాక్టర్‌ మల్లిక సారాబాయి నృత్య ప్రదర్శన శనివారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసినట్లు చీఫ్‌విప్‌ వినయ భాస్కర్‌ తెలిపారు. బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టీ సభ్యుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ బీవీ పాపారావు మాట్లాడారు. కాకతీయుల చరిత్ర ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కాకతీయ వారసులుగా మనందరిపై ఉందని అన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్‌ - మృణాళిని సారాబాయిల కూతురైన మల్లిక నృత్యకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని తెలిపారు. వరంగల్‌ కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ‘రామప్ప ఫెస్టివల్‌‘లో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తు న్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో ‘కుడా’ చైర్మన్‌ సుందర్‌రాజ్‌యాదవ్‌, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టీ జె.శ్రీధర్‌రావు, సామాజిక కార్యకర్త నిమ్మల శ్రీనివాస్‌, కల్పలత సూపర్‌బజార్‌ చైర్మన్‌ జనార్దన్‌, బూర విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-21T00:18:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising