కళతప్పిన ‘లక్నవరం’
ABN, First Publish Date - 2023-06-14T00:30:07+05:30
లక్నవరం సరస్సు కళ తప్పింది. డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయింది. నీటి అలల సోయగాలతో కళకళలాడే సరస్సులో ఎండమా వులు కమ్ముకున్నాయి.
గోవిందరావుపేట, జూన్ 13: లక్నవరం సరస్సు కళ తప్పింది. డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయింది. నీటి అలల సోయగాలతో కళకళలాడే సరస్సులో ఎండమా వులు కమ్ముకున్నాయి. బీటలు వారిన నేలతో మైదానా న్ని తలపిస్తోంది. దీంతో బోటు షికారు నిలిచిపోయిం ది. బోట్లను ఒడ్డుకు చేర్చే పరిస్థితి లేకపోవడంతో బురద గుంటల్లో వెలవెలబోతున్నాయి. ఉయ్యాల వంతెనలు కూడా కళతప్పాయి. లక్నవరం పూర్తి నీటి సామర్థ్యం 36 అడుగులు కాగా నీళ్లు అడిగం టిపోయాయి. అక్కడక్కడా మడుగులు మా త్రమే దర్శనమిస్తున్నాయి. వేసవి తాపానికి తోడు యాసంగిలో నీటి విడుదల వల్ల లక్న వరం వెలవెలబోతోంది. 3700 ఎకరాల ఆయ కట్టుకు మూడు నెలల కాలంలో నీరు విడుద ల చేశారు. దీంతో సరస్సు పూర్తి అడుగంటి పోయింది. నీరు లేకపోవడంతో పర్యాట కులె వరూ రావడంలేదు. వచ్చిన కొద్దిమంది ఈదృ శ్యాన్ని చూసి ఉసూరుమంటున్నారు. తెలంగా ణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ ఇటీవల సాగునీటి దినోత్సవం, చెరువుల పండుగ కూ డా నిర్వహించింది. లక్నవరంలోకి గోదావరి జలాల ను తరలించే ప్రక్రియను మాత్రం చేపట్టడంలేదు. రామప్ప రిజర్వాయర్ నుంచి లక్నవరం వరకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టుకు మోక్షం కలగడంలేదు. రూ.14.5 కోట్ల నిధు లను కేటా యించ గా నాలుగేళ్లుగా భూసేకరణ స్థాయిలోనే నిలిచిపో యింది. ప్రస్తుతం అడుగంటిన సరస్సు మళ్లీ కళకళలా డాలంటే వర్షాలు సమృద్ధిగా పడటమే ఏకైక మార్గం.
Updated Date - 2023-06-14T00:30:07+05:30 IST