ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఖరీఫ్‌.. కష్టమే

ABN, First Publish Date - 2023-07-02T00:38:13+05:30

ఖరీఫ్‌కు కష్ట కాలం వచ్చింది... ఖరీఫ్‌ జూన్‌ ప్రారంభంలోనే భారీ వర్షాలు పడి మొక్కలతో కళకళలా డుతుండగా వరినాట్లు పడాల్సిన సమయంలో వాన దేవుడు మొఖం చాటేశాడు.

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లిలో వాడిపోతున్న పత్తిమొక్కలు, నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో వాడిపోతున్న పత్తిమొక్కలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీ వర్షాలు లేక రైతుల విల విల

జూన్‌లో కురిసింది 146.6కు 76.9 మిల్లీ మీటర్లే..

లోటు మైనస్‌ 48.0 మిల్లీమీటర్ల వర్షపాతం

డెంజర్‌ జోన్‌లో నాలుగు మండలాలు

13 మండలాల్లో 20–59 లోటు వర్షం

నాలుగు రోజులుగా మళ్లీ భగ్గుమంటున్న ఎండలు

మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, జూలై 1 : ఖరీఫ్‌కు కష్ట కాలం వచ్చింది... ఖరీఫ్‌ జూన్‌ ప్రారంభంలోనే భారీ వర్షాలు పడి మొక్కలతో కళకళలా డుతుండగా వరినాట్లు పడాల్సిన సమయంలో వాన దేవుడు మొఖం చాటేశాడు. ఓ వైపు వర్షాలు లేక... మరోవైపు ఎండలు భగ్గుమంటుం డడంతో రైతులు విలవిలలాడిపోతున్నారు. నాలుగు రోజులుగా కొడుతున్న ఎండలు ఎండాకాలాన్ని మైమరి పిస్తున్నాయి. వ్యవసాయ పనులు ఎక్కడికక్కడే ఆగిపో యాయి. జూన్‌ నెలలో 10 రోజులు మాత్రమే చిన్నపాటి వర్షాలు కురిసాయే తప్పా భారీ వర్షాలు మాత్రం జాడలే దు. జూన్‌ 146.6 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండ గా 76.9 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.

వర్షం పడింది పదిరోజులే..

జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ 1 నుంచి జూలై 1వ తేదీ వరకు పదిరోజులుగా కొన్ని మండలాల్లో వర్షం కురిసింది. జూన్‌ 5వ తేదీ నుంచి 13 మండలాల్లో చిరు జల్లులు ప్రారంభమై 10న 8మండలాల్లో 11న 10 మండ లాల్లో, 18న 3 మండలాల్లో, 21న 18 మండలాల్లో, 22న 10 మండలాల్లో, 26న మూడు మండలాల్లో, 27న మూ డు మండలాల్లో, 28న 17 మండలాల్లో చిరుజల్లులు కురి యగా కొన్ని మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. 29న 8 మండలాల్లో చిరుజల్లులే కురిశాయి. జిల్లా వ్యా ప్తంగా 146.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 76.9 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. మైనస్‌ 48.0 లోటు వర్షపాతం నమోదైంది.

డెంజర్‌ జోన్‌లో నాలుగు మండలాలు..

అల్పశాతం వర్షపాతం నమోదులో రాష్ట్రంలో మహబూబాబాద్‌ జిల్లా 10వ స్థానంలో నిలిచింది. జిల్లాలో నాలుగు మండలాలు డెంజర్‌జోన్‌లో (66 నుంచి 99 శాతం లోటు వర్షపాతం) ఉన్నాయి. కొత్త గూడ మండలంలో జూన్‌ నెలలో 182.5 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 64.4 మిల్లీమీటర్లు పడగా మైనస్‌ 65.0 శాతం లోటు, బయ్యారంలో 155.6 మిల్లీమీటర్లకు 32.6 మిల్లీమీటర్ల వర్షపాతం పడగా 79.0 లోటు, కురవి మండలంలో 145.0 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 49.5 మాత్రమే పడి మైనస్‌ 66.0 లోటు, గూడూరులో 187.4 మిల్లీమీటర్లకు 69.3 మిల్లీమీటర్లు పడి మైనస్‌ 63.0 శాతం లోటు వర్షపాతం నమో దైంది. మండలాల్లో తక్కువ వర్షపాతం 20 నుంచి 59 శాతం వర్షపాతం ఉంది. గంగారం మండలంలో 76.9 మిల్లీమీటర్లకు 74.8 మిల్లీమీటర్లు పడింది. గార్ల మండలంలో 147.1 మిల్లీమీటర్లకు 97.8 మిల్లీమీటర్లు, డోర్నకల్‌లో 142.0కు 90.4 మిల్లీమీటర్లు, మహబూబాబాద్‌లో 153.6కు 73.4 మిల్లీమీటర్లు, కేసముద్రంలో 147.0కు 90.3 మిల్లీమీటర్లు, నెల్లికుదురులో 134.6కు 69.3 మిల్లీమీటర్లు, నర్సింహులపేటలో 118.7కు 57.6 మిల్లీమీటర్లు, చిన్నగూడూరులో 136.7కు 66.4 మిల్లీమీటర్లు, మరిపెడలో 141.0కు 79.1 మిల్లీమీటర్లు, దంతాలపల్లిలో 126.7కు 90.0, సీరోలులో 144.7కు 73.4, ఇనుగుర్తిలో 141.7కు 79.4, తొర్రూరులో 138.1కు 110.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లాలో సగటున 146.6 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా 76.9 మిల్లీమీటర్ల వర్షం పడి మైనస్‌ 48.0 మిల్లీమీటర్ల లోటు నమోదైంది. కాగా, పెద్దవంగర మండలంలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. 120.0 మిల్లీమీటర్లకు 116.4 మిల్లీమీటర్ల వర్షం కురిసి కేవలం మైనస్‌ 3 వర్షపాతం మాత్రమే లోటుగా ఉంది.

ఇప్పటి వరకు 35 వేల ఎకరాల్లో పత్తి

జిల్లాలో ఇప్పటి వరకు చిన్న చిన్న వర్షాలకు 35 వేల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు వ్యవసా యాధికారులు చెబుతున్నారు. 1000 ఎకరాల్లో మొక్కజొన్న, 300 ఎకరాల్లో పెసర్లు సాగు చేయగా ఇప్పుడి ప్పుడే నారు పోసుకుంటున్నారు. అలాగే మిర్చినారు కూడాపోసు కుంటున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే పూర్తిస్థాయిలో విత్తనాలు వేయడంతో పాటు నాట్లు కూడా వేసే అవకాశం ఉంది.

భగ్గుమంటున్న ఎండలు

నాలుగు రోజులుగా జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. వాతావరణంలో జరిగిన మార్పులతో ఈ జూలై నెలలో చల్లాగా ఉండాల్సిన వాతావరణం నాలుగు రోజులుగా భగ్గుమంటున్నాయి. ఎండకాలంలో ఉన్నంతగా తీవ్రత ఈ ఎండలు కొడుతున్నాయి. ఉబ్బరింపు కూడా అధికంగా ఉండడంతో ప్రజలతో పాటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు బాగా కొడుతుండడంతో మొక్కలను కాపాడుకో వడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు.

వానకోసం ఎదురుచూస్తున్నాం...

– ఈసంపల్లి సైదులు, రైతు, బొజ్జన్నపేట, నర్సింహులపేట

మొదలు కురిసిన వర్షానికి రెండు ఎకరా ల్లో పత్తి సాగు చేశాను. ఇంకా తనకున్న మూడె కరాల్లో ఇతర పంటల ను సాగు చేస్తాను. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు సగం మాత్రమే పత్తి మొలిచింది. వానకోసం ఎదురుచూస్తున్నాను. వర్షాలు పడాలని దేవుడిని కోరుకుంటున్నా.

పంటలు పండుతాయా..

– శీలంశెట్టి రమేష్‌, రైతు, గార్ల,

వర్షాలు ఆలస్యంగా వస్తుండడం వల్ల పంటలు పండుతా యో.. లేదోనని ఆందో ళనగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షా లపై ఆధారపడ్డ రైతులకు తీరని నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో రైతు లు జూలై మాసంలో ఆందోళన చెందు తున్నారు. జూన్‌ మాసం వడ్లు, పత్తి, మిర్చి వేసుకోవడంతో ఆలస్యమవుతోంది. చెరువుల్లో నీరు అడుగంటిపోయింది. వర్షాల కోసమే ఎదురుచూస్తున్నాం.

Updated Date - 2023-07-02T00:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising