వైద్య రంగంలో విప్లవం ‘కంటివెలుగు’
ABN, First Publish Date - 2023-01-06T00:25:54+05:30
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం వైద్య రంగంలో ఓ విప్లవమని స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షే మ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
కంటి సమస్యతో ఎవరూ బాధపడొద్దన్నదే సీఎం ధ్యేయం
సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్
భూపాలపల్లి కలెక్టరేట్, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం వైద్య రంగంలో ఓ విప్లవమని స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షే మ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. జిల్లా కేం ద్రంలోని ఇల్లందు క్లబ్‌హౌస్‌లో గురువారం నిర్వహిం చిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి, కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి మంత్రి గురువారం సమావేశమయ్యా రు. జిల్లాలో నిర్వహించనున్న కంటివెలుగు కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆయన శ్రీకా రం చుట్టారన్నారు. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం తొలివిడత విజయవంతమైం దన్నారు. రెండో విడతనూ అదే స్ఫూర్తితో విజయవం తం చేసేందుకు విశేష కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కనీసం దావాఖనాలకు వెళ్లలేని పరిసి ్థతుల్లో ఉన్న ఎంతో మంది పేదలు, అభాగ్యుల జీవితా ల్లో ప్రభుత్వం ‘కంటి వెలుగు’ను నింపుతోందని తెలిపా రు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ మందికి స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించిన ఘటన తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. జిల్లాలోని 241 గ్రామ పంచా యతీలు, 30 మునిసిపల్ వార్డులు ఉండగా కంటివె లుగు కార్యక్రమంలో 25 బృందాలు సేవలు అందిస్తా యన్నారు. ప్రజాప్రతినిఽధులు, అధికారులు సమన్వ యం చేసుకొని దీన్ని విజయవంతం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గంట ముందు నుంచే స్ర్కీనింగ్ ప్రారంభిస్తే ఎక్కువ మంది లబ్ధి పొందుతారన్నారు. కూలి పనులకు వెళ్తున్న వారికి ఇబ్బందులు కలగకుండా సకాలంలో స్ర్కీనింగ్ చేయాలని ఆదేశించారు. గ్రామాల వారీగా ఏ రోజు క్యాంపు నిర్వహిస్తారనే విషయాన్ని సర్పంచ్‌లు దండోరా చేయించాలన్నారు.
Updated Date - 2023-01-06T00:25:56+05:30 IST