ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రజకులకు అండగా ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-06-26T00:55:24+05:30

తెలంగాణలో రజకులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉచిత విద్యుత్‌, ధోబీ ఘాట్‌ల నిర్మాణం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు, జూన్‌ 25: తెలంగాణలో రజకులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరు పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఆదివారం రజక కుల సంఘాల నాయకులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు. పట్టణంలో రూ.2 కోట్లతో ఆధునిక ధోబీ ఘాట్‌లు ఏర్పాటు చేస్తామని, అత్యాధునిక ఫంక్షన్‌ హాల్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రజక సామాజిక వర్గానికి ఉచిత విద్యుత్‌తో పాటు పూర్తి స్థాయిలో ధోబీ ఘాట్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రజకుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు కుల వృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని, ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారి పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రత్యేక గురుకులాలు, విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సాయం, నామినేటెడ్‌ పదవులు కూడా ఇచ్చి ప్రోత్సహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రజకులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ రాంచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కాకిరాల హరిప్రసాద్‌, వివిధ వార్డుల కౌన్సిలర్లు, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:55:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising