అనాథ అమ్మకు అండ
ABN, First Publish Date - 2023-01-12T00:13:04+05:30
వృద్ధాప్యంలో తల్లిని కంటికిరెప్పలా చూసుకో వాల్సిన కుమార్తె.. ఆమె సంరక్షణను విస్మరించింది. తన స్వార్థం తాను చూసుకొని ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటివేసింది. ఆమె ప రిస్థితిని గమనించిన పోలీసులు చలించిపోయారు. మానవతా హృద యంతో చిన్న ఇల్లు నిర్మించి ఆశ్రయం ఏర్పాటు చేశారు. పోలీసుల స్పం దనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌లో చోటు చేసుకుంది.
లాంఛనంగా ప్రారంభించిన డీసీపీ
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దని హితవు
పోలీసుల స్పందనపై సర్వత్రా హర్షం
ఎల్కతుర్తి, జనవరి 11: వృద్ధాప్యంలో తల్లిని కంటికిరెప్పలా చూసుకో వాల్సిన కుమార్తె.. ఆమె సంరక్షణను విస్మరించింది. తన స్వార్థం తాను చూసుకొని ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటివేసింది. ఆమె ప రిస్థితిని గమనించిన పోలీసులు చలించిపోయారు. మానవతా హృద యంతో చిన్న ఇల్లు నిర్మించి ఆశ్రయం ఏర్పాటు చేశారు. పోలీసుల స్పం దనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌లో చోటు చేసుకుంది.
దామెర గ్రామానికి చెందిన మార్తకు 12ఏళ్ల వయస్సులో వివాహం జ రిగింది. చిన్న వయస్సులోనే కూతురు(కమల)కు జన్మనిచ్చింది. ఆ తర్వా త కుటుంబ సమస్యలతో భర్తను వదిలేసింది. దీంతో మేనమామలు స్వ గ్రామమైన దామెరకు తీసుకొచ్చారు. అదే గ్రామానికి చెందిన గొర్రె పోచయ్యతో తిరిగి వివాహం జరిపించారు. వీరికి ఎలాంటి సంతానం కలగలేదు. ఇద్దరు దంపతులు ఇందిరానగర్‌లో ఇల్లు, రెండెకరాల భూమి కొ నుగోలు చేసుకుని అక్కడే ఉంటూ జీవనం సాగించారు. కూతురు కమల ను కాజీపేటకు చెందిన ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి వివాహం జరిపించారు.
అయితే నాలుగేళ్ల కిందట భర్త పోచయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మార్త తన కూతురు కమల వద్దకు వెళ్లింది. అయితే కమల తన తల్లి మార్త పేర ఉన్న ఇల్లు, రెండు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని వేరే వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకుంది. ఆ తర్వాత పది రోజుల్లోనే తల్లి మార్తను చితకబాది ఇంటినుంచి గెంటివేసింది. దీంతో గ్రామంలో బంధువులు కొద్ది రోజులు ఆశ్రయం కల్పించగా, ఆరు నెలలుగా ఇందిరానగర్ హైవే పక్కన ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో మార్త తలదాచుకుంటోంది. బస్టాండ్ పక్కనే ఇల్లు ఉన్న గంజి పుష్పలీల.. బస్టాండ్‌లో ఉంటున్న మార్తకు తిండి పెడుతూ బాగోగులు చూ సుకుంటోంది. పత్రికల్లో వచ్చిన కథనానికి స్పందించిన కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, ఎస్సై జక్కుల పరమే్‌షలు ఆమె వద్దకు చేరుకుని జరిగిన విషయాన్ని ఆరాతీశారు. మార్త ఉండేందుకు ఎవరూ ఇల్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో పుష్పలీలను ఒప్పించి ఆమెకు చెందిన స్థలంలో రేకుల షెడ్డు నిర్మాణానికి ఏసీపీ శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ముగ్గు పోయించి నిర్మాణ పనులు చేపట్టారు. అవసరమైన వాటిని సమకూర్చి నెలరోజుల్లో ఇంటి నిర్మాణాన్ని అన్ని వసతులతో పూర్తి చేయించారు.
ఈ ఇల్లును సెంట్రల్ జోన్ డీసీపీ ఎన్.అశోక్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. తల్లిని కూతురు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి.. ఆస్తి కోసం ఇంటి నుంచి గెంటి వేయడం బాధాకరమన్నారు. వృద్ధురాలిని చేరదీసి ఇంటిని నిర్మించిన కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, రమేష్, ఎస్‌ఐ జక్కుల పరమే్‌షను అభినందించారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు ప్రవీణ్, పరమేష్, మౌనిక, సర్పంచ్ కడారి రమా, ఎంపీటీసీ బొంకూరి రజిత, పంచాయతీ కార్యదర్శి స్వామి, ఎల్‌ఎ్‌ససీఎస్ చైర్మన్ రవీందర్‌గౌడ్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-12T00:13:28+05:30 IST