వనదేవతలకు మొక్కులు
ABN, First Publish Date - 2023-06-01T00:26:39+05:30
తాడ్వాయి మండలం మేడారం వనదేవతలు సమ్మక్క, సార లమ్మల సన్నిధిలో బుధవారం సందడి నెలకొంది. తల్లులకు మొక్కులు తీర్చుకు నేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
వనదేవతల గద్దెలను దర్శించుకుంటున్న భక్తులు
మేడారానికి భారీగా తరలి వచ్చిన భక్తులు
మేడారం, మే 31 : తాడ్వాయి మండలం మేడారం వనదేవతలు సమ్మక్క, సార లమ్మల సన్నిధిలో బుధవారం సందడి నెలకొంది. తల్లులకు మొక్కులు తీర్చుకు నేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 20 వేల మంది మొక్కు లు చెల్లించుకున్నారని ఈవో రాజేంద్రం తెలిపారు. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల నీలాలు సమర్పిం చుకున్నారు. అనంతరం అమ్మవార్ల గద్దెలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Updated Date - 2023-06-01T00:26:39+05:30 IST