కోడ్.. కూసింది!
ABN, First Publish Date - 2023-10-10T00:00:48+05:30
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. అసెం బ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను ఈసీఐ సోమవారం విడుదల చేసింది.
మోగిన ఎన్నికల నగారా
అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
అధికారిక పనులకు ఇక బ్రేక్
జనగామ, అక్టోబరు 9 (ఆం ధ్రజ్యోతి): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. అసెం బ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను ఈసీఐ సోమవారం విడుదల చేసింది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేయడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల ప్రవర్తనా నియామావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలు, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను వేగి రం చేశారు. జిల్లాలో కోడ్.. కూయడంతో రాజకీయ పార్టీల కదలికపై జిల్లా ఎన్నికల అధికారులు కన్నేశా రు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈపాటికే నోడల్ అధికారులను నియమించి బాధ్యతలను అప్పగించగా.. ఇపుడు కోడ్ రావడంతో ఆయా కమిటీలను జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య అలర్ట్ చేశారు.
జెండాలు, వాల్ రైటింగుల తొలగింపు..
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లావ్యాప్తంగా రాజకీయ పార్టీలకు సంబంధించి జెండాలు, వాల్ రైటింగులు, ఫ్లెక్సీలు, కటౌట్ల తొలగింపు ప్రక్రియను సోమవా రం చేపట్టారు. అన్ని మండలాల్లో ఎంపీడీవోల ఆధ్వ ర్యంలో రాజకీయ పార్టీ జెండాలను తొలగిస్తున్నారు. చౌరస్తాలు, రోడ్లు వెంబడి, ప్రైవేటు స్థలాలతో పాటు ప్ర భుత్వ కార్యాలయాల్లోనూ జెండాలను తొలగిస్తున్నారు.
నవంబరు 3 నుంచి చెక్‌పోస్టులు
ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్రమ నగదు, మ ద్యం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ సో మవారం అమల్లోకి వచ్చినప్పటికీ నోటిఫికేషన్ విడుదల అయ్యే నవంబరు 3వ తేదీ నుంచి చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. కాగా.. ఈ పాటికే అక్రమ నగదు తరలింపును అడ్డుకట్టే వేసేందుకు గానూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. జిల్లా పరిధిలో 11 చెక్‌పోస్టులను జాతీయ రహదారి, ప్రధాన రహదారులపై ఏర్పాటు చేయనున్నారు.
అధికారిక పనులకు బ్రేక్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో అధికారిక కార్యక్రమాలకు బ్రేక్ పడింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్త నిర్ణయాలను అమలు చేసే అవకాశం ఇక ఉండదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే మంత్రి దయాకర్‌రావుతో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామ పంచాయ తీ భవనాలు, కమ్యూనిటీ భవనాల ప్రారంభోత్సవాలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇతర పనులకు శంకుస్థాపన వంటి వాటికి సంబంధించి వేగంగా చేశారు. ఇంకా ప్రారంభించాల్సిన, శంకుస్థాపనలు చేయాల్సిన కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఇందులో భాగంగా సోమవారం నాడు మంత్రి కేటీఆర్ కొడకండ్ల మినీ టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో మంత్రి దయాకర్‌రావు సోమవారం ఉదయమే హడావిడిగా పార్కుకు శంకుస్థాపన చేశారు.
ర్యాలీలు, సభలకు అనుమతి తప్పనిసరి
జిల్లాలో ఇకపై ఏ రాజకీయ పార్టీ అయినా ర్యాలీలు, సభలు నిర్వహించుకోవాలంటే జిల్లా ఎన్నికల అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నవంబరు 10 వరకు స్వీకరిస్తారు. 13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత నవంబరు 30న ఎన్నికలు జరగగా, డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Updated Date - 2023-10-10T00:00:48+05:30 IST