ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామన్న సభకు రావాలె అక్క..

ABN, First Publish Date - 2023-02-21T00:40:46+05:30

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురుపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటనను విజయవం తం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కోరారు.

భూపాలపల్లిలో మహిళకు బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్న గండ్ర జ్యోతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణకాలనీ (భూపాలపల్లి), ఫిబ్రవరి 20: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురుపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటనను విజయవం తం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 23న నిర్వహించ నున్న కేటీఆర్‌ సభలో పాల్గొనాలని పట్టణం లోని 26, 30వ వార్డుల్లో సోమవారం ఇంటింటా తిరిగుతూ ప్రచారం చేశారు. ప్రతిఒక్కరినీ పలకరిస్తూ సభకు ఆహ్వానిం చారు. మహిళలకు బొట్టు పెట్టి ‘రామన్న సభకు తప్పకుండా రావాలె అక్క..’ అని విజ్ఞప్తి చేశారు. మొదటిసారిగా మంత్రి కేటీఆర్‌ జిల్లా కేంద్రానికి వస్తున్నార న్నారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఘన స్వాగతం పలకాలని కోరారు కృష్ణకాలనీ లోని అంబేద్కర్‌ స్టేడియంలో బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొనాల న్నారు. ఆమె వెంట ఆయా వార్డుల కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising