ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కోటి శోభ

ABN, First Publish Date - 2023-01-02T23:59:32+05:30

కిటకిటలాడిన వైష్ణవాలయాలు వైకుంఠ ద్వార దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌, జనవరి 2: పవిత్ర ముక్కోటి ఏకాదశి వేడుకలు సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనం గా నిర్వహించారు. జనగామతో పాటు స్టేషన్‌ ఘన్‌పూ ర్‌, శివునిపల్లి పట్టణాల్లో వైభవంగా నిర్వహించారు. ఈ రోజు ఉపవాసం ఉంటూ పూజలు చేస్తే ముక్కోటి దేవతలు కరుణిస్తారన్న నమ్మకంతో భక్తులు వైష్ణవాలయాలకు పోటెత్తారు. ఘన్‌పూర్‌ తిరుమల నాథ స్వా మి దేవాలయం, శివునిపల్లి శ్రీ వేంకటేశ్వరాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఉదయం 5 గంటల నుంచే చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వేద పండితులు తిరుప్పావై, పాశురాలు, విష్ణు సహస్ర నామాలు, అష్టోత్తర శత నామావళి పఠిస్తుండగా పూ జాదికాలు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. కార్యక్రమంలో పూజారులు రంగాచారి, రామానుజాచా రి, శేషాచారి, వెంకటేశ్వర్లు, నరేష్‌, గన్ను శ్రీనివాస్‌, వాస వీ క్లబ్‌ అంతర్జాతీయ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తెల్లాకుల రామకృష్ణ, గోలి ప్రశాంత్‌, లక్ష్మి, పి.వెంకటేశం, పి.సోమశేఖర్‌, ఎం.రవీందర్‌, యాద శ్రీనివాస్‌, కూరెల్లి కృష్ణమూ ర్తి, గోలి శ్రీను, గట్టు స్వప్న, గోలి రాజశేఖర్‌, వి.తిరుమల శ్రీనివాస్‌, జిల్లా రాములు, ఐత సత్యం, వెంకట్రాం నర్స య్య, యుగేందర్‌, రవికిరణ్‌, బాలరాజు, హనుమంతర వు, రామ్మోహన్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

చిలుపూర్‌ వెంకన్న ఆలయానికి భక్తజనం

చిలుపూర్‌: చిలుపూర్‌ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా భక్తులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ముందుగా ఆలయ చైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌ రావు -కిరణ్మయి, ఈవో లక్ష్మీప్రసన్న నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేసి దర్శనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. వారిలో ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత-బాలరాజు, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ దురిశెట్టి ర ఘుచందర్‌, వరంగల్‌ జిల్లా డీఆర్డీవో మట్టపల్లి సంపత్‌రావు, గుల్లపల్లి శ్రీనివాస్‌, ఎంపీటీసీ తాళ్ళపల్లి ఉమ సమ్మయ్య, శాశ్వత దాతలు తండ చిరంజీవి, వనపర్తి శ్రీనివాస్‌ - నవ్య, గన్ను నర్సింహులు, నాగార్జున-షర్మిల, ఎస్సై బొల్లం వినయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

జిల్లాకేంద్రంలో..

జనగామ టౌన్‌: ముక్కోటి ఏకాదశి వేడుకలను జనగామలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీరామ్‌నగర్‌ కాలనీ మూలబావిలో వెలసిన శ్రీఅభయాంజనేయస్వా మి ఆలయంతో పాటు బాణాపురం శ్రీవేంకటేశ్వర స్వా మి దేవాలయంలో ఉత్తరద్వార దర్శన అవకాశం కల్పిం చగా భక్తులు పోటెత్తారు. ఉదయం 4 గంటలకు దర్శనా లు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగాయి. అర్చకులు జ్యోతిష్య శిరోమణి, మోహన కృష్ణభార్గవ, సంపత్‌కు మారా కృష్ణమాచార్య సిద్ధాంతి భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చారు. రాత్రి 8 గంటలకు బాణాపురం వేంకటేశ్వ రస్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు.

Updated Date - 2023-01-02T23:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising