ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కోటి శోభ

ABN, First Publish Date - 2023-01-02T23:41:00+05:30

బారులు తీరిన భక్తులు వైభవంగా ప్రత్యేక పూజలు గరుఢ వాహనంపై స్వామి వారి ఊరేగింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూపాలపల్లిటౌన్‌/మహదేవపూర్‌ రూరల్‌, జనవరి 2: ముక్కోటి ఏకాదశి వేడుకలను జయశంకర్‌ భూపా లపల్లి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయాలన్నీ కిక్కిరిసి పోయాయి. ప్రధానంగా మహదేవపూర్‌ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో సందడి నెలకొంది. మండల కేంద్రంలోని మందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుల కోలాహ లం కనిపించింది. ఆలయాల్లో స్వామివార్ల దర్శనాలకు ఉత్తరద్వారం ద్వారా అధికారులు ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం, భూపాలపల్లిలోని సహస్ర లింగేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు బారులు తీశారు. ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్టువు గరుఢ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని ప్రతీతి. అదే రోజు శివుడు హాలాహలం మింగాడని, మహాభారత యుదఽ్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడని విశ్వాసం.

కోటంచ ఆలయంలో..

ఠ రేగొండ: మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని గరుఢ వాహనంపై ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్‌, చైర్మన్‌ మాదాడి అనిత, ధర్మకర్తలు గైని కుమారస్వామి, పోగు సుమన్‌, మోతె రాజేశ్వరరావు, ఒన్నాల శంకర్‌, శెట్టి విజయ, సర్పంచ్‌ పబ్బా శ్రీనివాస్‌, ఎన్‌ఎస్‌ఆర్‌ అధినేత సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ఉత్తరద్వార దర్శనం

ఠ వెంకటాపురం(నూగూరు): మండల కేంద్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారు జామున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శన కార్యక్రమం వైభ వంగా జరిగింది. భక్తు లు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామి వారిని దర్శిం చుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎస్‌.ఆర్‌. ఆర్‌.రంగరాజు, ఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వామివారిని మండల కేంద్రంలో ఊరేగింపు నిర్వహించారు.

సీతారామచంద్ర స్వామి ఆలయంలో..

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామి వారిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మోడెం రమేష్‌, ప్రధాన అర్చకుడు ఎల్లప్రగఢ నాగేశ్వరరావుశర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమాన్ని చైర్మన్‌ రమేష్‌, మాజీ చైర్మన్‌ పోగుల లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అర్చకులు సూర్యనారాయణ శర్మ, రాధాకృష్ణ శర్మ, రాధాశర్మ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చిటమట రఘు, బీజేపీ మండల అధ్యక్షుడు గండబెల్లి సత్యం, ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు గాడిచర్ల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-02T23:42:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising