ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలేటి ఎల్లవ్వ జాతరకు పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2023-01-17T00:24:41+05:30

పట్నాలు వేసి మొక్కులు అప్పగింత శివసత్తుల పూనకాలతో మార్మోగిన ఆలయం బోనమెత్తుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకుర్తి, జనవరి 16: పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ శివారులో సోమవారం జరిగిన ఆలేటి ఎల్లవ్వ జాతరకు భక్తులు పోటెత్తారు. శివసత్తుల పూనకాలు, డోలు చప్పుళ్లతో మహిళలు బోనమెత్తుకొని ఆలేటి ఎల్లవ్వ తల్లి దర్శనానికి తరలివచ్చారు. పిల్లా పాపలను చల్లంగా చూసి.. పాడిపంటలు సమృద్ధిగా పండేలా దీవించు తల్లి అంటూ శరణు.. శరణు నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. మండలం నుంచే గాకుండా జనగామ, మహబూబా బాద్‌, సూర్యాపేట, వరంగల్‌ జిల్లాల పరిసర గ్రామా ల భక్తులు బస్సులు, వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎల్లవ్వ తల్లిని దర్శించుకున్నారు. మండలం లోని బమ్మెర, తొర్రూరు, అయ్యంగారిపల్లి, ఈరవెన్ను గ్రామాల నుంచి ఎద్దుల బండ్లతో వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయం ఎదుట పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు. సంతానం లేని మహిళలు తాటిచెట్టు వద్ద వరం పట్టారు.

పాలకుర్తి నుంచి బోనాలతో..

మండలంలోని బమ్మెర శివారులో జరిగిన ఆలేటి ఎల్లవ్వ జాతరకు పాలకుర్తి నుంచి వేలాది మంది మహిళలు బోనాలతో తరలివెళ్లారు. శివసత్తులు పూనకాలతో పాలకుర్తి నుంచి ఆలేటి ఎల్లవ్వ ఆలయం వరకు వెళ్లగా, కాలినడకన మహిళలు బోనమెత్తుకొని వెళ్లారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు, మోటార్‌ సైకిళ్లపై వేలాది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ఈ ప్రాంత ప్రజలు వందల సంవత్సరాల నుంచి ఆలేటి ఎల్లవ్వను కొలుస్తున్నారు. కాగా, బమ్మెర గ్రామ రెవెన్యూ పరిధిలో ఆలేటి ఎల్లవ్వ గుడి ఉండగా, వ్యవసాయ భూములు అయ్యంగారిపల్లి గ్రామానికి చెందినవి కావడంతో రైతులు దున్ని వదిలేశారు. దీంతో జాతరకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తుల వాహనాలను పోలీసులు గుడి వద్దకు వెళ్లకుండా నిలిపివేయడంతో కిలోమీటరు దూరం వరకు కాలినడకన వెళ్లారు.

బోనమెత్తుకున్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రా వు-ఉషా దంపతులు ఆలేటి ఎల్లవ్వ ఆలయానికి చేరుకొని బోనమెత్తుకున్నారు. ఎల్లవ్వ తల్లికి మొక్కులు అప్పగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తాటిచెట్టు వద మంత్రి దయాకర్‌రావు కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతన పుట్టిన ఊరు బమ్మెరలో ఇప్పటి వరకు పర్యాటక శాఖ నుంచి రూ.16 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బమ్మెర బస్‌స్టేజీ, అయ్యంగారిపల్లి గ్రామం నుంచి ఆలేటి ఎల్లవ్వ ఆలయం వరకు రూ.2 కోట్లు ఖర్చు చేసి బీటీ రోడ్డు పనులు పూర్తి చేసినట్లు చెప్పా రు. ఆలేటి ఎల్లవ్వ గుడిని ఇంకా అభివృద్ధి చేసేందుకు స్థలం లేకపోవడంతో రైతులతో చర్చలు జరిపి రెండెకరాల భూమి కొనుగోలు చేసి అభివృద్ధి పరుస్తా నని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం ప్రజల అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆలయాలను పునరుద్ధరించేం దుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎల్లవ్వ తల్లిని వేడు కున్నట్లు చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి వెంట పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, సర్పంచ్‌లు వీరమనేని యాకాంత రావు, జరుపుల మోజీ బాలూనా యక్‌, ముస్కు నిర్మల, కత్తి సైదు లు, నాయిని మల్లారెడ్డి, పుస్కూ రి పార్వతి, రాజేశ్వర్‌రావు, బొమ్మగాని కొంరయ్య, నాగభూ షణం, ముస్కు రాంబాబు, వైస్‌ ఎంపీపీ దార శారదశంకరయ్య, నాయకులు బత్తిని గోపాల్‌, సోమ య్య, పొన్నాల వెంకన్న, మాచెర్ల ఎల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-17T00:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising