ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డుపై వరి నాట్లతో గ్రామస్తుల నిరసన

ABN, First Publish Date - 2023-07-21T03:36:49+05:30

జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని సల్కాపురం గ్రామంలో ప్రధాన రహదారి బురదగుంటగా మారి,

గట్టు, జూలై 20 : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని సల్కాపురం గ్రామంలో ప్రధాన రహదారి బురదగుంటగా మారి, ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గురువారం గ్రామస్థులు రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకు రోడ్డంతా బురదమయంగా మారి నడవడానికి వీలులేకుండా తయారైందని, రోడ్డు బాగు చేయాలని గ్రామ సర్పంచ్‌, అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు ఆరోపించారు. ప్రతీ సంవత్సరం వర్షాకాలం వచ్చిందటే బురదమయంగా మారిన రోడ్డుపైనే వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డు బాగుచేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-07-21T03:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising