ఖైరతాబాద్ గణపతి సేవలో వెంకయ్యనాయుడు
ABN, First Publish Date - 2023-09-22T03:24:05+05:30
ఖైరతాబాద్ గణేశుడిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకొని పూజలు చేశారు. అక్కడకు వెళ్లిన వెంకయ్యను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
ఖైరతాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్ గణేశుడిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకొని పూజలు చేశారు. అక్కడకు వెళ్లిన వెంకయ్యను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ, ఖైరతాబాద్ గణపతికి దేశవ్యాప్త గుర్తింపు ఉందని అన్నారు. గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ లేని లోటును ఆయన కుమారులు, కూమార్తెలు తీరుస్తూ ఉత్సవాలను ప్రతియేటా వైభవంగా నిర్వహించాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
Updated Date - 2023-09-22T03:24:05+05:30 IST