ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉసురు తీసిన ఉపనయనం

ABN, First Publish Date - 2023-02-10T01:25:07+05:30

ఉపనయన క్రతువు విషాదాంతమైంది. మూడు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమం పూర్తిచేసుకుని సంధ్యావందనం చేసి పుష్కర ఘాట్‌లో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన నీటి ఉధృతితో ముగ్గురు గల్లంతయ్యారు. మూ డు గంటలు గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

పుష్కర ఘాట్‌ వద్ద రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉసురు తీసిన ఉపనయనం

ముగ్గురు యువకుల దుర్మరణం

స్నానం చేస్తుండగా నీటి ఉధృతికి గల్లంతు

సాగర్‌ శివాలయం పుష్కర ఘాట్‌ వద్ద ఘటన

నాగార్జునసాగర్‌, ఫిబ్రవరి 9: ఉపనయన క్రతువు విషాదాంతమైంది. మూడు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమం పూర్తిచేసుకుని సంధ్యావందనం చేసి పుష్కర ఘాట్‌లో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన నీటి ఉధృతితో ముగ్గురు గల్లంతయ్యారు. మూ డు గంటలు గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నాగార్జునసాగర్‌ పైలాన కాలనీలోని ప్రధాన జలవిద్యుత కేంద్రానికి దిగువన ఉన్న శివాలయం పుష్కరఘాట్‌ వద్ద గురువారం రాత్రి ఈ విషాదం నెలకొంది. సాగర్‌ ఎస్‌ఐ రాం బాబు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన వేంకటేశ్వరశర్మ ఒక ప్రధాన దిన పత్రికలో పనిచేస్తుండగా, ఆయ న కుమారుడు వాచస్పతి (20)(హర్షిత) ఐఐఐటీ గ్వాలియర్‌లో ట్రిబుల్‌ ఐ టీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. హర్షితకు ఉపనయనం నిర్వహించేందుకు మూడు రోజుల క్రితం నాగార్జునసాగర్‌లోని తన అన్న గారైన ద త్తు ఇంటికి చేరుకున్నారు. ఈ క్రతువు నిర్వహించేందుకు హైదరాబాద్‌కు చెందిన నాగరాజు(39) వారితో పాటు సాగర్‌కు వచ్చారు. హర్షితకు మూ డు రోజులుగా నాగార్జునసాగర్‌ పైలానకాలనీలో ప్రధాన జలవిద్యుత కేం ద్రానికి దిగువన ఉన్న శివాలయం పుష్కర ఘాట్‌ వద్ద ఉపనయనం క్రతువులు నిర్వహిస్తున్నారు. మూడో రోజైన గురువారం హర్షిత (20), దత్తు కుమారుడైన చంద్రకాంత (20), నాగరాజు (39) ఉపనయనం అనంతరం సంధ్యావందనం చేసి స్నానం చేస్తున్నారు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రధాన జలవిద్యుత కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 20,311 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయటంతో పుష్కర ఘాట్‌లోకి నీటి ఉ ధృతి అధికమై ముగ్గురూ నీటిలో గల్లంతయ్యారు. గమనించిన యువకుల తల్లిదండ్రులు సాగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు పుట్టిల్లో జాలర్ల సహకారం తో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటం కం ఏర్పడింది. దీంతో టార్చిలైట్ల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9.40 గంటల సమయంలో చంద్రకాంత, 9.54కు నాగరాజు, 10.04కు హర్షిత మృతదేహాలు పుష్కర ఘాట్‌కు కొంత దూరంలో లభ్యమయ్యాయి. ఈ ఘటనపై మృతుల తల్లిదండ్రులు వేంకటేశ్వరశర్మ, దత్తు, రామనాథశర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. చంద్రకాంత నల్లగొండ వాసి కాగా, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయడంతో పాటు పౌరోహిత్యం కూడా చేస్తున్నారు.

విద్యుదుత్పత్తి చేస్తుండటంతో..

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత కేంద్రంలో విద్యుతను ఉత్పత్తి చేస్తుండటంతో దిగువకు 20,311 క్యూసెక్కుల నీరు ఉధృతిగా ప్రవహిస్తుంది. దీంతో వరద ఉధృతిని అంచనా వేయలేని యువకులు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. శివాలయం ఘాట్‌ వద్ద రాత్రి సమయంలో విద్యుత దీపాలు కూడా లేకపోవడంతో చిమ్మ చీకట్లు కమ్ముకుని గాలింపునకు ఇబ్బంది పడ్డారు.

సొమ్మసిల్లిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలింపు

అప్పటివరకూ తమతో ఉండి పూజల్లో పాల్గొన్న కుమారుడు, ఇతరులు కళ్లెదుట నీటిలో కొట్టుకుపోయి విగతజీవులుగా మారటంతో మృతుల కు టుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. ఇద్దరు మహిళలు రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వారిని స్థానిక కమలానెహ్రూ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2023-02-10T01:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising