ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పశ్చిమ బెంగాల్‌లో రెండు గూడ్స్‌ రైళ్లు ఢీ

ABN, First Publish Date - 2023-06-26T03:28:18+05:30

బంకూరా, జూన్‌ 25: పశ్చిమ బెంగాల్‌లోని బంకూరాలో ఆదివారం రెండు గూడ్స్‌ రైళ్లు ఢీకొనడం కలకలం రేపింది. ఓండా స్టేషన్‌లో ఒక రైలును మరో రైలు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టాలు తప్పిన 12 బోగీలు

బంకూరా, జూన్‌ 25: పశ్చిమ బెంగాల్‌లోని బంకూరాలో ఆదివారం రెండు గూడ్స్‌ రైళ్లు ఢీకొనడం కలకలం రేపింది. ఓండా స్టేషన్‌లో ఒక రైలును మరో రైలు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లనప్పటికీ.. ఒక రైల్లోని డ్రైవర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. ‘‘రెండు రైళ్లలోనూ అన్నీ ఖాళీ బోగీలే ఉండటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు’’ అని వివరించారు. ఈ ప్రమాదం కారణంగా బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌, బంకూరా, పురూలియా, బుర్ద్వాన్‌ జిల్లాలతో పాటు ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌, బొకారో, సింఘ్‌భూమ్‌ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. కాగా, ఈ నెల 2న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మరో రెండు రైళ్లను ఢీకొట్టడంతో 275మంది ప్రాణాలను కోల్పోయిన దుర్ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-06-26T03:28:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising