TS Employees DA : కేంద్ర ఉద్యోగులకు డీఏ ప్రకటనతో.. తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళన!
ABN, First Publish Date - 2023-10-19T04:44:12+05:30
కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని(డీఏ) బుధవారం ప్రకటించడంతో.. రాష్ట్ర ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నా రాష్ట్ర
కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ విడుదల..
పెండింగ్ డీఏలపై రాష్ట్ర ఉద్యోగుల్లో ఆందోళన
రావాల్సిన మూడు డీఏల మొత్తం 10.92%
ఎన్నికల కోడ్ ఆటంకం కాదంటున్న సంఘాలు
సీఎస్ జోక్యం చేసుకుని విడుదల చేయాలని..
సీఈసీ అనుమతి తీసుకోవాలని డిమాండ్లు
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని(డీఏ) బుధవారం ప్రకటించడంతో.. రాష్ట్ర ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏలను విడుదల చేస్తామంటూ ఊరించి, చివరకు ఎన్నికల షెడ్యూలు వెలువడే వరకూ ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకుని.. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నుంచి అనుమతి తీసుకుని డీఏలను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 1.7.2022, 1.1.2023, 1.7.2023లకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెడింగ్‌లో ఉనర్నాయి. సాధారణంగా కేంద్ర ఉద్యోగులకు డీఏ ప్రకటించగానే.. రాష్ట్ర ప్రభుత్వాలూ డీఏలను ప్రకటించడం అనవాయితీ. కానీ.. కేంద్రం తన ఉద్యోగులకు ఎప్పటికప్పుడు డీఏలను ప్రకటిస్తున్నా నిరుడు జూలై నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసినప్పుడల్లా... అన్ని సమస్యలతో పాటు డీఏల విడుదల గురించి ప్రస్తావించగా, అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూలు వెలువడకముందు వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) ఏర్పాటు చేసి, 5 శాతం మధ్యంతర భృతిని ప్రకటించింది. ఆ తర్వాత ఉద్యోగుల వైద్య చికిత్సల కోసం ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స)’ ట్రస్టును ఏర్పాటు చేసింది. ఇవే సమస్యలతో పాటు మూడు డీఏలను కూడా విడుదల చేయాలంటూ ఉద్యోగులు కోరుతూ వచ్చారు. కానీ... ఈ డీఏల సమస్యను ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వెలువడింది. డీఏల సమస్య పెండింగ్‌లో పడిపోయింది. ఈ క్రమంలో.. బుధవారం కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 4 శాతం డీఏను ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమకూ పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు డీఏల మొత్తం 10.92 శాతం పెండింగ్‌లో ఉందని, ఇది విడుదలైతే... వేతనాలు పెరుగుతాయని వారు పేర్కొంటున్నారు.
‘కోడ్’ అడ్డం కాదు...
ఎన్నికల షెడ్యూలు వెలువడినందున డీఏల విడుదలకు ఎన్నికల కోడ్ ఆటంకమవుతుందన్న అభిప్రాయాలున్నాయి. కానీ.. కోడ్ ఎంతమాత్రం అడ్డం కాదని ఉద్యోగ సంఘాలు వివరిస్తున్నాయి. డీఏ అనేది ఎప్పుడూ అమల్లో ఉండే అంశమని, ఒకసారి అమల్లోకి వచ్చిన ఏదైనా పథకాన్ని, కార్యక్రమాన్ని ‘కొనసాగింపు’ కిందనే పరిగణించాల్సి ఉంటుందని చెబుతున్నాయి. మార్కెట్లో నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కరువు భత్యాలను విడుదల చేయాలన్నది ప్రాథమిక సూత్రమని వివరిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉందన్న కారణంతో నిత్యావసరాల ధరలు పెరగకుండా నిలిచిపోవు కదా అని ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ ‘కోడ్’ ఆటంకంగా ఉందని భావిస్తే... కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) లేఖ రాసి అనుమతి తీసుకోవచ్చని చెబుతున్నాయి. దీనికి సీఈసీ కూడా పెద్దగా అభ్యంతరం చెప్పదని, గతంలో కోడ్ ఉన్నప్పటికీ డీఏలను విడుదల చేసిన దృష్టాంతాలున్నాయని గుర్తుచేస్తున్నాయి.
డీఏలను విడుదల చేయాలి
కేంద్రం బుధవారం తన ఉద్యోగులకు జూలై డీఏను విడుదల చేసింది. అదేమాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏలను విడుదల చేయాలి. మూడు డీఏల మొత్తం 10.92 శాతం పెండింగ్‌లో ఉంది. ఈ డీఏలు ఎప్పటికప్పుడు విడుదలైతే మా వేతనాలు పెరిగేవి. ఇప్పుడు కోడ్ అడ్డంగా ఉందన్న సాకు చెప్పడం సరికాదు.
- ఏఎ్‌సఎన్ రెడ్డి, చక్రధర్, హైదరాబాద్
ఇంజనీర్స్ అసోసియేషన్
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
డీఏలను విడుదల చేయాలి
కేంద్రం బుధవారం తన ఉద్యోగులకు జూలై డీఏను విడుదల చేసింది. అదేమాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏలను విడుదల చేయాలి. మూడు డీఏల మొత్తం 10.92 శాతం పెండింగ్‌లో ఉంది. ఈ డీఏలు ఎప్పటికప్పుడు విడుదలైతే మా వేతనాలు పెరిగేవి. ఇప్పుడు కోడ్ అడ్డంగా ఉందన్న సాకు చెప్పడం సరికాదు.
- ఏఎ్‌సఎన్ రెడ్డి, చక్రధర్, హైదరాబాద్
ఇంజనీర్స్ అసోసియేషన్
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
Updated Date - 2023-10-19T09:47:55+05:30 IST