ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విదేశాలకు వెళ్లడమూ ప్రాథమిక హక్కే: ఢిల్లీ కోర్టు

ABN, First Publish Date - 2023-06-26T02:31:34+05:30

విదేశాలకు వెళ్లే హక్కు ఓ విలువైన ప్రాథమిక హక్కేనని.. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే దాన్ని నియంత్రించగలమని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. రూ.135 కోట్ల బ్యాంకు రుణ మోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 25: విదేశాలకు వెళ్లే హక్కు ఓ విలువైన ప్రాథమిక హక్కేనని.. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే దాన్ని నియంత్రించగలమని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. రూ.135 కోట్ల బ్యాంకు రుణ మోసం కేసులో నిందితుడైన వ్యాపారవేత్త రామన్‌ సేథి తన కుమారుడి స్నాతకోత్సవానికి అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తాజాగా ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించవద్దని, సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆదేశిస్తూ అమెరికా వెళ్లేందుకు ఈనెల 12 నుంచి 30 వరకు అనుమతినిస్తూ ప్రత్యేక జడ్జి అనిల్‌ యాంటిల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న పీసీఎల్‌ ఆయిల్‌, సాల్వెంట్స్‌ లిమిటెడ్‌ కంపెనీ, దాని డైరెక్టర్లు 2012-2020 మధ్యలో 135.5 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా చేసి తప్పుడు లెక్కలు చూపించారని సీబీఐ ఆరోపించింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, రామన్‌ సేథి విదేశాలకు వెళ్లేందుకు చేసిన దరఖాస్తును వ్యతిరేకించింది.

Updated Date - 2023-06-26T02:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising