ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

26 మందితో టీపీసీసీ ఎన్నికల కమిటీ

ABN, First Publish Date - 2023-07-21T02:54:29+05:30

మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పలు కీలక కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల ప్రచార కమిటీని ప్రకటించిన పార్టీ అధిష్ఠానం తాజాగా టీపీసీసీ ఎన్నికల కమిటీని ప్రకటించింది.

చైర్మన్‌గా రేవంత్‌ రెడ్డి.. ప్రకటించిన అధిష్ఠానం

అదనంగా ముగ్గురు ఎక్స్‌అఫీషియో సభ్యులు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పలు కీలక కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల ప్రచార కమిటీని ప్రకటించిన పార్టీ అధిష్ఠానం తాజాగా టీపీసీసీ ఎన్నికల కమిటీని ప్రకటించింది. 26 మందితో ఎన్నికల కమిటీని నియమిస్తూ గురువారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కమిటీలో చోటు లభించింది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ టి. జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొదెం వీరయ్య, సీతక్క, సీనియర్‌ నేతలు బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, జె.గీతా రెడ్డి, మహమ్మద్‌ అజారుద్దీన్‌, ఎం.అంజన్‌ కుమార్‌ యాదవ్‌, కె. జానారెడ్డి, వి. హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్‌, చల్ల వంశీచంద్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌, రేణుకా చౌదరి, బలరాం నాయక్‌, షబ్బీర్‌ అలీ, ప్రేమ్‌సాగర్‌ రావు, ఎం. సునీతా రావు ముదిరాజ్‌ సభ్యులుగా ఉంటారు. కాగా, యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర సేవా దళ్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ ఈ కమిటీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. కాగా, దశాబ్దాల నుంచి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న తమకు ఎన్నికల కమిటీలో అవకాశం కల్పించకపోవడంపై పులువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి ప్రచార కమిటీ, ఎన్నికల కమిటీలోనూ స్థానం కల్పించి తమను నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-07-21T02:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising