ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడు, రేపు కేసీఆర్‌ ‘మహా’ పర్యటన

ABN, First Publish Date - 2023-06-26T02:24:35+05:30

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి టూర్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఈ పర్యటనకు వెళ్లనున్నారు. తొలిరోజు మహారాష్ట్రలోని షోలాపూర్‌లో బీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండోరోజు పండరీపూర్‌, తుల్జాపూర్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం కేసీఆర్‌ అల్పాహారం చేస్తారు. ఆ తర్వాత 10 గంటలకు రోడ్డుమార్గాన హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రకు భారీ కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్తారు. సాయంత్రానికి షోలాపూర్‌ చేరుకుని అక్కడే బస చేస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి వలప వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబాలు సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు తెలిపాయి. ఈ నేపథ్యంలో షోలాపూర్‌ జిల్లాకు చెందిన భగీరథ్‌ బాల్కేతోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరనున్నారు. షోలాపూర్‌లో రాత్రి బస చేసి.. మంగళవారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలోనే పండరీపూర్‌కు చేరుకొని అక్కడి విఠోభారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత దారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. అదేరోజు అక్కడి నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో తిరుగుప్రయాణం అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2023-06-26T02:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising