ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మ్యూజియానికి మూడెకరాల్లేవా?

ABN, First Publish Date - 2023-09-22T03:31:59+05:30

అవి అపురూపమైన ఆదివాసీ కళాఖండాలు..! భరతముని తన నాట్యశాస్త్రంలో ప్రస్తావించిన డొడొంక వాయిద్యాలు, విశ్వబ్రాహ్మణుల ఆశ్రిత కులాలు వాయించే ‘రుంజ’, చరిత్ర పుటల్లో గిరిజనులు వాడినట్లుగా చెప్పే రకరకాల డప్పులు, చిత్రాలు, కోయ చిత్రపటాలు,

అరుదైన ఆదివాసీ చరిత్రకు చెదలు!..

సర్కారు నుంచి మూడేళ్లుగా స్పందన కరువు

45 ఏళ్లుగా 4500 కళాఖండాలు సేకరించిన

విశ్రాంత ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల్‌ రావు

భరతముని నాట్యశాస్త్రంలోని ‘డొడొంక’ కూడా

రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ప్రశంసలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఓరుగల్లు): అవి అపురూపమైన ఆదివాసీ కళాఖండాలు..! భరతముని తన నాట్యశాస్త్రంలో ప్రస్తావించిన డొడొంక వాయిద్యాలు, విశ్వబ్రాహ్మణుల ఆశ్రిత కులాలు వాయించే ‘రుంజ’, చరిత్ర పుటల్లో గిరిజనులు వాడినట్లుగా చెప్పే రకరకాల డప్పులు, చిత్రాలు, కోయ చిత్రపటాలు, ఇనుము/ఇత్తడి/కంచు లోహాలను కలగలిపి చేసిన ప్రాచీన దేవతామూర్తులు.. ఇలా ఎన్నెన్నో..! అవి కాలగతిలో కలిసిపోకుండా.. భావి తరాలకు అందజేసేలా 45 ఏళ్లుగా విశ్రాంత ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల్‌రావు అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. ఆ సేకరణను ఓ మ్యూజియంలా ఏర్పాటు చేసేందుకు మూడెకరాల భూమి కోసం మూడేళ్లుగా సర్కారు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు మ్యూజియాలకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమవ్వగా.. భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో.. ఆ నిధులు మురిగిపోయే ప్రమాదమేర్పడింది. అంతేకాదు..! అరుదైన కళాఖండాలకు చెదలు పడుతున్నాయి.

ఆద్యకళలో.. వేర్వేరు విభాగాలు

వందల ఏళ్లుగా ఆదివాసీల జీవన విధానంలో దాగి ఉన్న అనేక అంశాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటిని ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల్‌రావు ‘ఆద్యకళ’ పేరుతో పరిరక్షిస్తూ వస్తున్నారు. ఆద్యకళను ఆయన ఆది ధ్వని, ఆది లోహ కళ, ఆది అక్షరం, ఆది చిత్రం, ఆది జీవితం అని ఐదు విభాగాలుగా విభజించారు. అపురూప కళాఖండాలను సేకరించే వీలు దొరకని చోట ఆయన వాటి నమూనాలను చేయించారు. ఆది ధ్వని విభాగంలో చర్మ, తీగ(తంత్రి) వాయిద్యాలు, ఊదే, వాయించే వాయిద్యాలను సేకరించారు. క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందిన భరతముని రాసిన నాట్యశాస్త్రంలో పేర్కొన్న ‘డొడొంక’ వంటి అనేక అరుదైన వాయిద్య పరికరాలను దండకారణ్యంలోని ఆదివాసీల వద్ద గుర్తించారు. దాని నమూనాను తయారు చేయించారు. విశ్వబ్రాహ్మణుల ఆశ్రిత కులాలు వాయించే ‘రుంజ’ వాయిద్యం కూడా కనుమరుగవుతోంది. ఆది లోహకళకు సంబంధించి ఇనుము, ఇత్తడి, కంచు లోహాలతో తయారు చేసిన ప్రాచీన దేవతామూర్తులు, పాత్రలు, పరికరాలను సేకరించారు. ఆది అక్షరానికి సంబంధించి తెలుగుకు పూర్వమే ఉనికిలో ఉన్న గోండి లిపిని ఆయన సేకరించి, సాఫ్ట్‌వేర్‌ తయారు చేయించారు. ఎముకలు, చెక్కలు, పాత్రలు, చర్మంతో తయారుచేసిన పుస్తకాల్లో తెలుగు లిపి ఉండడం గమనార్హం. అంతేకాకుండా.. ఆది లిపి విభాగంలో రాత ప్రతులు, తాళపత్రాలు, వివిధరకాల ఘంటాలు, కాగితం రాత ప్రతులను సేకరించారు. ఆది చిత్రం విభాగంలో కోయ చరిత్రలను వివరించే పటాలు, పగిడెలు, కులపురాణ, గంగ పటాలు, గ్రామ దేవతల బొమ్మలెన్నో ఉన్నాయి.

రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు

ఆద్యకళ పేరుతో ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల్‌రావు కృషి పారి్‌సలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు కూడా వేదికైంది. రాష్ట్రపతి భవన్‌లో ‘జనజాతి దర్పణ్‌’ పేరుతో ఆదివాసీ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ 250 వస్తువులను ప్రదర్శించగా.. వాటిల్లో ఆద్యకళ ద్వారా సేకరించినవే 170 పరికరాలు, వస్తువులు ఉండడం విశేషం..! ఆద్యకళను గుర్తించి, రాష్ట్రపతి ముర్ము రెండుసార్లు, ప్రధాని నరేంద్ర మోదీ ఒకసారి ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావుతో మాట్లాడారు. ఆ వెంటనే కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు.. ఆద్యకళలోని ఐదు భాగాలకు.. ఒక్కో భాగానికి ఒక్కో మ్యూజియం చొప్పున ఏర్పాటుకు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఒక్కో మ్యూజియానికి రూ.కోట్లను మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడెకరాల స్థలం చూపిస్తే.. ఆ నిధులను సద్వినియోగం చేసుకునే అవకాశాలుంటాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేక.. ఇప్పుడు ఆ కళాఖండాలు పాడవుతున్నాయి.

స్పందించని రాష్ట్ర సర్కారు..!

పారిశ్రామిక వేత్తలు అడిగిందే తడవుగా విలువైన భూములను కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. జీహెచ్‌ఎంసీ, శివారు ప్రాంతాల్లో గిరిజన మ్యూజియం విషయంలో మూడేళ్లుగా నాన్చుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మీడియాలో ఆద్యకళపై వచ్చిన కథనాలకు మంత్రులు కేటీఆర్‌, శ్రీనివా్‌సగౌడ్‌ స్పందించి, ఆ వస్తువుల పరిరక్షణకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్‌(గతంలో ట్విటర్‌) వేదికగా ప్రకటించినా.. అడుగు ముందుకు పడలేదు. పలు రియల్‌ఎస్టేట్‌ సంస్థలు, సినీ స్టూడియోలు, విశాఖ, ముంబై, ఢిల్లీ నగరాల్లోని కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. తమకు మ్యూజి యం, వస్తువులను పూర్తిగా అప్పగిస్తే.. ఆర్థిక చేయూతనందిస్తామని ఆఫర్లిచ్చాయి. అయితే.. ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ఆ కార్యం జరగాలని సున్నితంగా ఆ ఆఫర్లను ప్రొఫసర్‌ తిరుమల్‌రావు తిరస్కరించారు.

Updated Date - 2023-09-22T03:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising