ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుగులలో 47.1 డిగ్రీలు!

ABN, First Publish Date - 2023-06-11T03:04:38+05:30

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గట్లేదు. మృగశిర కార్తె వచ్చినా భానుడు శాంతించడం లేదు. కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా కనుగులలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత

మృగశిర కార్తెలోనూ ఎండల తీవ్రత

నేడు, రేపు ఎండలు ఎక్కువే..

వచ్చే 4 రోజులు అక్కడక్కడ వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గట్లేదు. మృగశిర కార్తె వచ్చినా భానుడు శాంతించడం లేదు. కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా కనుగులలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధికం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రత నమోదవగా వాటిలో 8 ప్రాంతాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోవే ఉన్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 46.5, అదే జిల్లా పమ్మి, బాణాపురంలో 46.2, సత్తుపల్లిలో 45.8, ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, ఆసిఫాబాద్‌ జిల్లా జంబుగలో 45.7, భద్రాద్రి జిల్లా యానంభైలు 45.6, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో శని, ఆదివారాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు.. వచ్చే నాలుగు రోజులకు వానల విషయంలో యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పడే అవకాశముందని తెలిపింది.

Updated Date - 2023-06-11T03:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising