దొంగలకే మళ్లీ తాళాలిచ్చారు: షర్మిల
ABN, First Publish Date - 2023-06-26T03:51:19+05:30
దళితబంధు పథకానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే రాబంధులని చెప్పిన కేసీఆర్....
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): దళితబంధు పథకానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే రాబంధులని చెప్పిన కేసీఆర్.. ఆ దొంగలకే మళ్లీ తాళాలు కట్టబెట్టారని వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. ఎవరెంత తిన్నారో అన్ని లెక్కలు ఉన్నాయని, బెదిరించి.. ఎన్నికలకు కావాల్సినంత తినండంటూ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత మళ్లీ ఇచ్చారని ధ్వజమెత్తారు. ‘నియోజకవర్గానికి 11 వందల మందికి దళిత బంధు ఇస్తున్నరు. అంటే సగం కమిషన్ తీసుకున్నా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 55 కోట్లు. వంద నియోజకవర్గాలకు లెక్క కడితే సుమారు రూ.6వేల కోట్లు. దళిత బిడ్డల పేరు చెప్పి ఎన్నికల వేళ ఎమ్మెల్యేలకు దోచిపెట్టే కుట్ర ఇది’’ అని ఆరోపించారు.
Updated Date - 2023-06-26T03:51:19+05:30 IST